దేశంలో రెండు కొత్త వైరస్ స్ట్రెయిన్స్ ని కనుగొన్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిని ‘N44OK’, ‘E 484K’ వేరియంట్లుగా గుర్తించినట్టు తెలిపింది. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో వీటి ఉనికిని కనుగొన్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు డా. వి.కె. పాల్ తెలిపారు. ఇప్పటికే దేశంలో మూడు మ్యుటెంట్ వేరియంట్లు ఉన్నాయని, బ్రిటన్, సౌతాఫ్రికా, బ్రెజిల్ దేశాల నుంచి ఇవి ప్రవేశించాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు పెరగడానికి ఈ మ్యుటెంట్ వేరియంట్లే కారణమని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఇది ఇంకా నిర్ధారణ కావలసి ఉందన్నారు. యూకే వేరియంట్ ని 187 మందిలో, సౌతాఫ్రికా మ్యుటెంట్ ని ఆరుగురిలో, బ్రెజిలియన్ వేరియంట్ ని ఒక వ్యక్తిలో కనుగొన్నట్టు అయన చెప్పారు.
దేశంలోని కోవిడ్ యాక్టివ్ కేసుల్లో కేరళ , మహారాష్ట్రల్లో 75 శాతం కేసులు నమోదైనట్టు ఈ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. కేరళలో 38 శాతం, మహారాష్ట్రలో 37, కర్ణాటకలో 4, తమిళనాడులో 2.78 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆయన చెప్పారు. కాగా తెలంగాణకు సంబంధించి ఆయన వివరించలేదు.
Also Read: