అదృష్టం వరించింది.. కూలీల పంట పండింది… మట్టిలో దొరికిన విలువైన వజ్రాలు.. ధర తెలిస్తే షాక్ అవుతారు.!

|

Feb 24, 2021 | 2:32 PM

Madhya Pradesh Labourers: రాత్రికి రాత్రే కోటిశ్వరుడు కావడం మనం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో నిరుపేదలు రాత్రికి రాత్రే..

అదృష్టం వరించింది.. కూలీల పంట పండింది… మట్టిలో దొరికిన విలువైన వజ్రాలు.. ధర తెలిస్తే షాక్ అవుతారు.!
Follow us on

Madhya Pradesh Labourers: రాత్రికి రాత్రే కోటిశ్వరుడు కావడం మనం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో నిరుపేదలు రాత్రికి రాత్రే లక్షాధికారులు అయ్యారంటే ఆశ్యర్యం కలగక మానదు. కానీ ఇది నిజం. మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఈ ఘటన జరిగింది. ఒక్కరాత్రిలోనే కొందరు కూలీల దశమారిపోయింది. లక్షాధికారులు అయిపోయారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

పన్నాలో నివసిస్తున్న భగవాన్​దాస్​ కుష్వాహ్​ అనే కూలీ రంగురాళ్లు ఏరుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు నలుగురు స్నేహితులతో కలిసి రంగురాళ్ల భూమిగా పేరొందిన ఇట్వాకాస్ గ్రామంలో కొంత ప్రాంతాన్ని ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నాడు. ఆ ఐదుగురు అక్కడ తవ్వకాలు జరిపి వజ్రాల కోసం వేట మొదలుపెట్టారు. వారంతా కలిసి రాత్రింబవళ్లు శ్రమిస్తూ..అదృష్టం కోసం తీవ్రంగా వెతికారు. ఎట్టకేలకు వారి శ్రమ ఫలించింది. సోమవారం భగవాన్​కు కీతా వజ్రాల గనిలో రెండు వజ్రాలు దొరికాయి. వాటిలో ఒకటి 7.93 క్యారెట్లు, మరొకటి 1.93 క్యారెట్లు ఉంది.

భగవాన్,​ అతని మిత్రులకు దొరికిన రెండు వజ్రాలను వచ్చే నెలలో వేలం వేయనున్నట్లు పన్నా కలెక్టర్​ సంజయ్​ కుమార్ మిశ్రా తెలిపారు. వజ్రాలు చాలా స్వచ్ఛంగా ఉన్నాయని, బహిరంగ మార్కెట్లో వీటి ధర 35 లక్షలకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విలువైన వజ్రాలు దొరకటంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. దొరికిన వజ్రాలను వేలంపాట వేయనున్న నేపథ్యంలో వాటి నుంచి వచ్చే మొత్తంతో అప్పు తీర్చుకుంటామని కూలీలు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!