Fire Accident: కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం.. సినిమా థియేటర్‌లో చెలరేగిన మంటలు.. ఘటన స్థలానికి 15 ఫైరింజన్లు

Fire Accident: దేశంలో రోజురోజుకు అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదవశాత్తు, షార్ట్‌సర్క్యూట్‌ తదితర కారణాలతో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంది. భారీ..

Fire Accident: కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం.. సినిమా థియేటర్‌లో చెలరేగిన మంటలు.. ఘటన స్థలానికి 15 ఫైరింజన్లు
Fire Accident

Updated on: Jul 03, 2021 | 5:31 AM

Fire Accident: దేశంలో రోజురోజుకు అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదవశాత్తు, షార్ట్‌సర్క్యూట్‌ తదితర కారణాలతో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంది. భారీ మొత్తంలో ఆస్తి నష్టం సంభవిస్తున్నాయి. ఇక తాజాగా కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జయ సినిమా థియేటర్‌లో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి 15 ఫైరింజన్లతో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి సమయంలో జయ సినిమా హాల్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, దేశంలో ఇలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అనేకమైన అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో కోవడ్‌ ఆస్పత్రుల్లో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాల వల్ల ఎంతో మంది కోవిడ్‌ బాధితులు అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలు విఫలం కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.

ఇవీ కూడా చదవండి

వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న మహిళతో కలిసి కిడ్నాప్ డ్రామా.. చివరకు

Darbhanga Blasts: కైరానా టూ దర్భంగా వయా హైదరాబాద్..పాకిస్తాన్ నుంచి ఆదేశాలు..భారత్‌లో విధ్వంసాలు