Man Spitting On ‘Rotis’: అసలు ఇదేం పాడు బుద్ధి.. అందరూ తినాల్సిన రోటీలపై ఎందుకు ఉమ్మివేస్తున్నారు.?

Man Spitting On 'Rotis': ఇటీవల జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తులున్నాయి. తాజాగా ఢిల్లీ చెందిన ఇద్దరు వ్యక్తులు హేయమైన పనికి పాల్పడ్డారు. ఢిల్లీలోని ఓ హోట్‌లో...

Man  Spitting On Rotis: అసలు ఇదేం పాడు బుద్ధి.. అందరూ తినాల్సిన రోటీలపై ఎందుకు ఉమ్మివేస్తున్నారు.?
Spitting On Rotis

Updated on: Mar 19, 2021 | 2:53 AM

Man Spitting On ‘Rotis’: ఇటీవల జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తులున్నాయి. తాజాగా ఢిల్లీ చెందిన ఇద్దరు వ్యక్తులు హేయమైన పనికి పాల్పడ్డారు. ఢిల్లీలోని ఓ హోట్‌లో పనిచేస్తున్న ఇద్దరు వర్కర్లు కస్టమర్స్‌ కోసం రోటీలు తయారు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో రోటీలు చేసే వారు చేయకుండా.. వాటిపై ఉమ్మివేస్తూ రోటీలను తయారు చేశారు. ఇక ఆ ఇద్దరు వ్యక్తులు చేస్తోన్న ఈ నీచమైన పనిని అక్కడే ఉన్నో ఓ వ్యక్తి మొబైల్‌ ఫోన్‌లో సీక్రెట్‌గా రికార్డు చేశాడు. దీంతో ఈ విషయం కాస్తా ప్రపంచానికి తెలిసింది.
ఈ వీడియో ఆధారంగా పోలీసులు సదరు వ్యక్తులను గుర్తించారు. ఆ ఇద్దరు వ్యక్తులను సాబి అన్వర్‌, ఇబ్రహిం అని పోలీసులు తెలిపారు. ఇక వీరు చేసిన ఈ చర్యకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా సదరు హోటల్‌ నిర్వాహకుడు కూడా ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తుండడంతో యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీలో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో..

అయితే ఇలా రోటీలపై ఉమ్మివేసే తతంగం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఓ వివాహ వేడుకలో రోటీలు తయారు చేసే సమయంలో యువకుడు ఉమ్మివేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘిజయాబాద్‌లో అతిథులు తినాల్సిన రోటీలపై ఓ యువకుడు ఉమ్మివేస్తూ తయారు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. దీంతో వీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. అసలు ఇందే పాడు బుద్ది, తినే రోటీలపై ఉమ్మివేయడం ఏంటంటూ.. నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో..

Also Read: Feeling Tired In Office: ఆఫీసులో పనిచేసేప్పుడు ఊరికే అలిసిపోతున్నారా..? పరిశోధకులు ఏం సలహాలిస్తున్నారో చూడండి..

Pranayama Yoga : మానసిక ప్రశాంతతనిచ్చి.. ఉత్తేజం కలిగించడానికి చేయండి ప్రాణాయామా..

ఆ సెక్స్ డాల్‌ను పెళ్లి చేసుకొని ఇప్పుడు నచ్చలేదని విడాకులు ఇచ్చేశాడు : divorced to sex doll Video.