దేశంలో వ్యాక్సిన్ కొరత, లభ్యతపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయ మధ్య ట్విటర్ వార్ సాగింది. జులై నెల కూడా ముగిసిందని, కానీ దేశంలో వ్యాక్సిన్ కొరత తీరలేదని రాహుల్ మొదట ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. దీనికి మాన్ సుఖ్ మాండవీయ కౌంటర్ ఇస్తూ.. జులైలో 13 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను ఇవ్వడం జరిగిందని, ప్రజలకు ఈ నెలలో ఇంకా ఎక్కువ డోసులు ఇస్తామని ట్వీట్ చేశారు. మన వైద్య సిబ్బంది, హెల్త్ కేర్ వర్కర్ల కృషికి మీరు వారిని అభినందించాలని….ఇందుకు మీరు కూడా గర్వపడాలని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 13 కోట్ల మందిలో బహుశా మీరు కూడా ఉన్నారని విన్నానని.. కానీ మీరు మన రీసెర్చర్లు, శాస్త్రజ్ఞులను గానీ, మన హెల్త్ కేర్ వర్కర్లను గానీ ప్రశంసించడం లేదని పేర్కొన్నారు.టీకామందు తప్పనిసరిగా తీసుకోవాలని మీరు ప్రజలను కోరారా అని మాండవీయ ప్రశ్నించారు. నిజానికి ఇది వ్యాక్సిన్ కొరత కాదని, మీలో పరిణతి లేకపోవడమే అని ఆయన ఎద్దేవా చేశారు.
కాగా శనివారం నాటికి ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కవరేజీ 47 కోట్లు దాటినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారానికి.. ఆదివారం ఉదయానికి మధ్య ప్రజలకు 60.15 లక్షల డోసులను ఇచ్చినట్టు వెల్లడించింది. సోమవారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగవంతమవుతుందని పేర్కొంది. ఏ నెలలో ఎంతమంది ప్రజలు టీకామందు తీసుకున్నారో డేటాను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని కూడా పేర్కొంది. .
మరిన్ని ఇక్కడ చూడండి : ఖాకీ కావరం..బూటుకాలితో తన్నుతూ ఇలా..!మాస్క్ పెట్టుకోలేదని..:Police attack Video.
పోర్నోగ్రఫీ కేసులో తిరగబడిన శిల్పా శెట్టి..!మీడియాపై ఫైర్ అయినా హీరోయిన్..:Pornography case Video.
పాతిపెట్టిన శవం.. ఎలా బయటకు వచ్చింది..?నడిరోడ్డుపై శవ పేటిక..:Buried corpse video.