Niranjan Reddy: కేంద్రం తీరు అభ్యంతరకరం.. ధాన్యం కోలుగోలుపై లిఖిపూర్వక హామీ ఇవ్వాలంటూ నిరంజన్ రెడ్డి డిమాండ్

|

Dec 20, 2021 | 1:09 PM

Minister Niranjan Reddy: వరి ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలంటూ తెలంగాణ మంత్రులు దేశ రాజధాని ఢిల్లీ బాట పట్టారు. రాజకీయాల కోసం ఢిల్లీకి రాలేదు .. రైతుల సమస్యలు కేంద్రానికి..

Niranjan Reddy: కేంద్రం తీరు అభ్యంతరకరం.. ధాన్యం కోలుగోలుపై లిఖిపూర్వక హామీ ఇవ్వాలంటూ నిరంజన్ రెడ్డి డిమాండ్
Niranjan Reddy
Follow us on

Minister Niranjan Reddy: వరి ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలంటూ తెలంగాణ మంత్రులు దేశ రాజధాని ఢిల్లీ బాట పట్టారు. రాజకీయాల కోసం ఢిల్లీకి రాలేదు .. రైతుల సమస్యలు కేంద్రానికి చెప్పేందుకు వచ్చామంటూ తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హస్తిన వేదికగా తన గళం వినిపిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 6952 కొనుగోలు కేంద్రాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. కేంద్రం అనుమతించిన మేరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ ఈ రోజుతో పూర్తి కానున్నది.. అయితే ఇంకా కొనుగోలు కేంద్రాల దగ్గర తేమ శాతం తగ్గేందుకు ఆరబెట్టిన సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తూకాలకు సిద్దంగా ఉందని చెప్పారు. అందుకనే కేంద్రప్రభుత్వానికి వారికోనుగోలు టార్గెట్ పెంచమని ఇప్పటికే కోరామని చెప్పారు.

ఇప్పటి వరకూ ధాన్యం కొనుగోలు సెంటర్స్ వద్ద ఉన్న ధాన్యం కాకుండా రాష్ట్రంలో ఇంకా అనేక ప్రాంతాల్లో వరికోతలు  జరగవలసి ఉంది. వచ్చే నెల 15 వరకూ కోతలు జరిగే అవకాశం ఉందని క్షేత్రస్థాయిలో అధికారులు చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో ఇప్పుడు పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తానని మాట ఇవ్వడమే కాదు.. లిఖితపూర్వక హామీ ఇవ్వాలంటూ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

కేంద్రం రాష్ట్రాలను, రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను రాజకీయ కోణంలో చూడడం మానేసి రైతుల దృష్టితో చూడడం అలవరుచుకోవాలంటూ హితవు పలికారు.  అయితే  కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసేందుకు  తమ బృందం ప్రత్నాలు చేస్తుందని.. ఇప్పటి వరకూ భేటీకి అనుమతినిస్తూ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు.  కేంద్ర మంత్రి భేటీకి సమయం ఇచ్చే వరకు మా బృందం వేచిచూస్తుందని.. రైతాంగానికి సంబంధించిన అంశాల మీద ..  రాష్ట్రాల నుండి ఎవరు వెళ్లినా.. కేంద్ర మంత్రులు సమయం ఇచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కారమార్గం చూపించడం ఉత్తమమని అన్నారు. ప్రసుత్తం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పద్దతి అభ్యంతరకరమని తెలిపారు.   కేంద్రం వ్యవహారశైలి తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమే .. వెంటనే పునరాలోచించి మంత్రుల బృందానికి సమయం కేటాయించాలని కోరారు నిరంజన్ రెడ్డి.

 

Also Read:  పెళ్లి రోజున కొత్త వధూవరులు డ్యాన్స్.. మధ్యలో కుక్క సందడి.. వీడియో వైరల్