Madhya Pradesh: అర్ధరాత్రి ఆర్మీ అధికారులపై దాడి చేసి దోచుకున్న దుండగులు.. అధికారి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం..

|

Sep 12, 2024 | 8:00 AM

ఇండోర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రాత్మక జామ్ గేట్ సమీపంలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఈ విషయంపై అదనపు ఎస్పీ ద్వివేది స్పందిస్తూ ఆరుగురు అనుమానితులను గుర్తించామని.. ఆ నిందితులు ఇద్దరు అడవిలో ఉండగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. సామూహిక దాడిలో ఇద్దరు సైనికాధికారులు గాయపడ్డారు. సామూహిక అత్యాచారానికి గురైన అధికారుల మహిళా స్నేహితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Madhya Pradesh: అర్ధరాత్రి ఆర్మీ అధికారులపై దాడి చేసి దోచుకున్న దుండగులు.. అధికారి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం..
Two Army Officers Assaulted
Follow us on

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణమైన ఘటన జరిగింది. మంగళవారం రాత్రి ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు వారితో ఉన్న ఇద్దరు మహిళా స్నేహితులపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఓ ఆర్మీ అధికారిని తుపాకీతో బెదిరించి బందీగా పట్టుకున్నారు. అతనితో పాటు ఉన్న మహిళా స్నేహితురాలిని అడవిలోకి తీసుకుని వెళ్లి అక్కడ ఆ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. అదే సమయంలో మరొక సైనిక అధికారిని దుండగులు బెదిరిస్తూ 10 లక్షలు తీసుకుని వస్తేనే బందీగా ఉన్న ఆర్మీ అధికారిని విడిచిపెడతామని చెప్పారు. ఆ సైనికాధికారి దుండగుల నుంచి తప్పించుకుని ఈ విషయాన్ని తన సీనియర్లకు తెలియజేశాడు. వెంటనే అక్కడికి పోలీసు బృందం చేరుకుంది. అయితే అప్పటికి చాలా ఆలస్యమైంది. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

TOI నివేదిక ప్రకారం ఇండోర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రాత్మక జామ్ గేట్ సమీపంలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఈ విషయంపై అదనపు ఎస్పీ ద్వివేది స్పందిస్తూ ఆరుగురు అనుమానితులను గుర్తించామని.. ఆ నిందితులు ఇద్దరు అడవిలో ఉండగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. సామూహిక దాడిలో ఇద్దరు సైనికాధికారులు గాయపడ్డారు. సామూహిక అత్యాచారానికి గురైన అధికారుల మహిళా స్నేహితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఎస్పీ (రూరల్) హితికా వాసల్ మాట్లాడుతూ ఆర్మీ సిబ్బంది ఇద్దరూ ఇన్‌ఫాంట్రీ స్కూల్ ఆఫ్ మోవ్‌లో యంగ్ ఆఫీసర్స్ కోర్సు చేస్తున్నారని చెప్పారు. ఇదే విషయంపై లెఫ్టినెంట్‌ స్పందిస్తూ నలుగురం మంగళవారం రాత్రి మోవ్-మండలేశ్వర్ రోడ్డులోని జామ్ గేట్ సమీపంలోని అహల్య గేట్‌కు చేరుకున్నామని.. రాత్రి 2.30 గంటల ప్రాంతంలో తన స్నేహితుడు తన ప్రియురాలితో కలిసి కారులో వెళుతుండగా 6-7 మంది వ్యక్తులు దాడి చేశారని లెఫ్టినెంట్‌ చెప్పారు. ఆ సమయంలో తాను తన స్నేహితురాలితో కలిసి సమీపంలోని కొండపై ఉన్నానని .. అరుపుల శబ్దం విని తాను క్రిందికి వచ్చానని చెప్పారు.

ఇవి కూడా చదవండి

10 లక్షల విరాళం డిమాండ్ చేశారు

ఫిర్యాదులో.. దాడి చేసినవారు కారులో కూర్చున్న తన స్నేహితుడిని దారుణంగా కొట్టి బందీగా ఉంచారు. అనంతరం అతని ప్రియురాలిని అడవిలోకి తీసుకెళ్లారు. తాను కిందకు రాగానే తనని, తన స్నేహితుడిని కూడా కొట్టారు. వెళ్లి రూ.10 లక్షల డబ్బులు తీసుకుని రావాలని.. అప్పుడు మాత్రమే వీరిద్దరినీ విడుదల చేస్తామని డిమాండ్ చేశారు. డబ్బులు అడిగే వంకతో తాను తన సీనియర్ అధికారులకు ఫోన్ చేసి సంఘటన గురించి తెలియజేశాను. వెంటనే పోలీసులు రంగం లోకి దిగి సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పాడు.

సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ

ఎస్పీ మాట్లాడుతూ ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను పంపించామని.. అయితే అప్పటికే దాడి చేసిన వారు అడవిలోకి పారిపోయారని చెప్పారు. నలుగురినీ ఉదయం 6.30 గంటలకు మోవ్ సివిల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్య పరీక్షలలో ఒక మహిళ సామూహిక అత్యాచారానికి గురైనట్లు నిర్ధారించబడింది. ఇద్దరు అధికారుల శరీరాలపై గాయాల గుర్తులు ఉన్నాయి. . ప్రస్తుతం నిందితుల కోసం బార్గొండ పోలీసులు గాలిస్తున్నామని.. త్వరలో అందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..