ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మ‌ృతి

మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఛతర్పూర్ జిల్లా చంద్రనగర్‌లో జరిగిన ఈ ఘటనలో 8 మంది మృత్యువాతపడ్డారు. చంద్రనగర్‌లోని పన్నా రోడ్డు వైపు వెళ్తున్న స్కార్పియో వాహనం

ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మ‌ృతి

Updated on: Jul 27, 2020 | 5:23 PM

మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఛతర్పూర్ జిల్లా చంద్రనగర్‌లో జరిగిన ఈ ఘటనలో 8 మంది మృత్యువాతపడ్డారు. చంద్రనగర్‌లోని పన్నా రోడ్డు వైపు వెళ్తున్న స్కార్పియో వాహనం ఎదురుగా వస్తున్న మూడు మోటారు సైకిళ్లను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లుగా అక్కడున్న స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికిచేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆ ప్రాంతమంతా రక్తం ఏరులైపారింది. గాయపడిన వారు, మరణించిన వారి శరీరాలు అక్కడంతా చెల్లా చెదురుగా పడిపోయాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.