Thirunallar Saneeswaran Temple: ఆలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్నాయా..? అక్కడ ఎవరి నిఘా ఉండటం లేదా..? భక్తులకు ఇబ్బందిగా మారుతోందా..? చేస్తున్న ప్రభుత్వాలా..? స్థానిక వ్యాపారులా..? అవును ఇది నిజం అని తేలింది. ప్రభుత్వాలు కాదు ప్రజలే ఇందుకు కారణంగా మారుతున్నారు. డబ్బు సంపాదనకు అడ్డగా మార్చుకుంటున్నారా..? దేవుడిని దర్శించుకునేందుకు వస్తున్నవారిని వారికి తెలియకుండానే నిలువునా దోచుకుంటున్నారు.
పుదుచ్చేరిలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన శనీశ్వరన్ దేవాలయం వద్ద జరుగుతున్న ఘటనే ఇందుకు నిదర్శనంగా మారుతోంది. కారైకాల్ పక్కనే తిరునల్లార్ వద్ద ఉన్న ఈ ఆలయం పరిసరాల్లో అధికారులు జరిపిన దాడుల్లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. దేశం నలుమూలల నుండి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు ఒక్కో రాశిలో 20 సంవత్సరాల పాటు సంచరిస్తాడు. ప్రతి 2 1/2 సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుండి మరొక రాశికి మారతాడు. తిరునల్లార్‌లోని శ్రీ దర్భనేశ్వర్ ఆలయంలో శనిదేవుని పూజా స్థలంగా శని గ్రహ మార్పిడి కార్యక్రమం జరుపుకుంటారు.
అలాగే, జ్యోతిష్యాన్ని విశ్వసించే వారు తమ రాశిచక్రంలో వచ్చే మార్పుల నివారణల కోసం తిరునల్లార్ శనీశ్వరన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ ఆలయంలో యాచకులకు ఆహారం దానం చేయడం ఆనవాయితీ. అయితే, అక్కడ జరుగుతున్న దానంలో చాలా వరకు పాడైపోయిన ఆహారమే ఉంటోంది. ఒకసారి విక్రయించిన ఆహార పొట్లాలను మళ్లీమళ్లీ విక్రయించడమే ఇందుకు కారణం. భక్తులు అందించిన ఈ పరిహార ఆహార పదార్థాలను తిరిగి రెమెడియల్ ఫుడ్ ఐటమ్స్ స్టోర్‌కు అమ్మకానికి తీసుకెళ్లారని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఫిర్యాదులు అందాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అయితే అక్కడ జరుగుతున్న వ్యవహారం చూసిన అధికారులకు దిమ్మతిరిగిపోయింది.
ముందుగా కొలను వద్ద భక్తులకు వ్యాపారులు తమ వద్ద ఉన్న ఆహార పొట్లాలను విక్రయిస్తుంటారు. వాటితో పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత వాటిని భక్తులు యాచకులకు దానం చేస్తుంటారు. దానం స్వీకరించిన యాచకులు వాటిని తీసుకెళ్లి వ్యాపారులకు తిరిగి విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇలా యాచకుల నుంచి తీసుకున్న ఆహార పొట్లాలను వ్యాపారులు మళ్లీ భక్తులకు అమ్మేస్తున్నారు. ఇలా జరుగుతున్న తీరును చూసిన అధికారులు యాచకులు, వ్యాపారుల నుంచి పాడైపోయిన ఆహార పొట్లాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బిచ్చగాళ్ల నుంచి పాడైపోయిన ఆహార పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పాడైపోయిన ఆహార పదార్థాలను విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఇకపై వారంలో ఒకరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు.
ఇవి కూడా చదవండి: Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..