గత నెలలో లదాఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ గురించి తెలిసిందే. ఈ ఘటనలో ఇరవై మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. మరో నలభై మంది వరకు చైనాకు చెందిన జవాన్లు కూడా మరణించారు. అయితే ఈ ఘటన తర్వాత చైనాపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడింది. అంతేకాదు.. బ్యాన్ చైనా ప్రోడక్ట్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఉద్యమమే నడిచింది. ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో చైనా వస్తువులను తగలబెడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో చైనీస్ వస్తువుల తయారీకి చెక్ పెడుతూ.. మేడ్ ఇన్ ఇండియా వస్తువులకు ఒక్క సారిగా డిమాండ్ పెరిగింది.
ఈ క్రమంలో ఆటబొమ్మలు తయారు చేసేవారు.. చైనీస్ కంపెనీలకు ధీటుగా.. ఉత్పత్తిని పెంచుతున్నాయి. దీంతో ఇక చైనా నుంచి ఆటబొమ్మలను దిగుమతి చేసుకోకుండా.. మన దేశంలో తయారైన వస్తువులనే ఉపయోగించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు తయారీ దారులు కూడా.. తక్కువ ధరకే మంచి నాణ్యత గల వస్తువులు తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా గుజరాత్‌లో ఆటబొమ్మలు తయారు చేసే యజమానులు ఈ విషయాన్ని తెలియజేశారు. గాల్వాన్ ఘటన తర్వాత.. మేడ్ ఇన్ ఇండియా వస్తువులకు డిమాండ్ పెరిగిందన్నారు. ప్రస్తుతం తాము 200 రకాల ఆటబొమ్మలను తయారు చేసేందుకు రెడీ అయ్యామని.. ప్రస్తుతం 50 రకాల ఆటవస్తువులను తయారు చేస్తున్నామన్నారు.
Gujarat: Toy manufacturers in Rajkot say there is a demand for India-made products in market after the Galwan Valley clash with China. A manufacturer, Subhash Jala says, “We are planning to develop more than 200 types of toys. We have started with 50 different types.” (16.07.20) pic.twitter.com/bM544AkL8o
— ANI (@ANI) July 17, 2020