India Corona Updates: దేశవ్యాప్తంగా తగ్గిన పాజిటివ్ కేసులు.. పెరిగిన మరణాలు..

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు దిగివస్తోంది. మరణాల సంఖ్య మాత్రం కొద్దిగా పెరిగింది. గ‌డ‌చిన 24 గంట‌ల వ్యవధిలో కొత్తగా 48,786 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు.

India Corona Updates: దేశవ్యాప్తంగా తగ్గిన పాజిటివ్ కేసులు.. పెరిగిన మరణాలు..
India Corona

Updated on: Jul 01, 2021 | 10:29 AM

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు దిగివస్తోంది. మరణాల సంఖ్య మాత్రం కొద్దిగా పెరిగింది. గ‌డ‌చిన 24 గంట‌ల వ్యవధిలో కొత్తగా 48,786 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. బుధవారం ఒక్కరోజే 61,588 మంది కోలకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,11,634కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

కాగా, బుధవారం క‌రోనా నుంచి 2,94,88,918 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇదే స‌మ‌యంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా త‌గ్గింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనాతో చనిపోయిన 1,005 మందితో కలిపి మొత్తం క‌రోనా మరణాల సంఖ్య 3,99,459 కు చేరింది. దేశంలో ప్రస్తుతం క‌రోనాకు చికిత్స పొందుతున్న వారిసంఖ్య 5,23,257కు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి.

ఇవి కూడా చదవండి: Anti-Drone System: జమ్ముకశ్మీర్‌లో డ్రోన్‌ టెర్రర్‌‌కు చెక్.. ఎయిర్‌బేస్‌పై యాంటీ డ్రోన్‌ జామర్లు

Warangal Chai Wala: మహ్మద్‌ పాషాతో ఫోన్‌లో మాట్లాడనున్న ప్రధాని మోడీ.. ‘మన్ కీ బాత్’లో వరంగల్ చాయ్ వాలా