Lightning strikes: బెంగాల్‌లో పిడుగల వర్షం.. రెండు జిల్లాల్లో 20 మంది మృతి..

lightning strikes: బెంగాల్‌పై పిడుగుల వర్షం కురిసింది. ఉరుములు, పిడుగుల ధాటికి 20 మంది మరణించారు. ప్రధానంగా మూడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు....

Lightning strikes: బెంగాల్‌లో పిడుగల వర్షం.. రెండు జిల్లాల్లో 20 మంది మృతి..
Lightning Strikes

Updated on: Jun 07, 2021 | 10:46 PM

బెంగాల్‌పై పిడుగుల వర్షం కురిసింది. ఉరుములు, పిడుగుల ధాటికి 20 మంది మరణించారు. ప్రధానంగా మూడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి ప్రకటించారు. పిడుగుల ధాటికి మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ముర్షిదాబాద్‌, హుగ్లీల్లో ఒక్కో జిల్లాలో తొమ్మిది మంది మరణించారు. మెదీనిపూర్ జిల్లాలో ఇద్దరు చనిపోయారు. కోల్‌కతా సహా దక్షిణ బంగాల్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి భారీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

పిడుగల కారణంగా చనిపోయినవారికి ప్రధాని మోడీ  సంతాపం వ్యక్తం చేశారు.  మరణించినవారి బంధువులకు తక్షణ సాయంగా రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. బెంగాల్​లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగుల కారణంగా ఆత్మీయులను కోల్పోయిన వారిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. నా ఆలోచనలన్నీ వారితోనే ఉన్నాయి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా  అంటూ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: Income Tax E-filing Portal: కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లాంచ్.. ఇక చెల్లింపులు చాలా ఈజీ

 Tv9 Effect: డబ్బు జబ్బు పట్టిన ఆస్పత్రులకు చెక్ పెట్టిన టీవీ 9.. తెలంగాణ సర్కార్ కొరడాతో దారిలోకి..

JioSaavnTV: జియో నుంచి సరికొత్త వీడియో ప్లాట్ ఫామ్.. ప్రత్యేకమైన వీడియో ఫీచర్‌ విడుదల