Maoist leader RK: మరణం అనంతరం విప్లవ శిఖరం ఆర్కే ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్..

|

Oct 16, 2021 | 2:56 PM

మావోయిస్టు అగ్ర నాయకుడు ఆర్కే ఈ నెల 14న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. 63 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు.

Maoist leader RK: మరణం అనంతరం విప్లవ శిఖరం ఆర్కే ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్..
Maoist Rk
Follow us on

40ఏళ్ల ఉద్యమ ప్రస్థానం… జీవితం మొత్తం అడవికే అంకితం… కుటుంబాన్ని వదులుకున్నా… టీచర్ ఉద్యోగాన్ని వదిలేసినా, కొడుకును పోగొట్టుకున్నా.. చివరికి తన ప్రాణమే పొగొట్టుకున్నా… అంతా ప్రజల కోసమే… అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరుబాట పట్టాడు… ఆర్కే(అక్కిరాజు హరగోపాల్‌)… నాలుగు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం మొత్తం ప్రజల కోసమే. ఈ నెల 14న ఉదయం 6 గంటలకు ఆర్కే అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కిడ్నీలు విఫలమవ్వడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా ఆర్కే చనిపోయిన అనంతరం పలువురు కామ్రేడ్స్, గిరిజనులు నివాళులు అర్పించిన ఫోటోలను టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది.

అడవిలో ఆర్కే మృతదేహం దగ్గర మావోయిస్టులు నివాళులు అర్పిస్తున్న ఫొటోలు ఇవి. అంత్యక్రియలకు ముందు ఈ ఫొటోలు తీశారు. నిన్న మధ్యాహ్నం ఆర్కే అంత్యక్రియలు జరిగాయి. తెలంగాణ సరిహద్దుల్లో అంత్యక్రియలు జరిగినట్లు తెలుస్తోంది. 2004లో చర్చల సమయంలో ఆర్కేకు, ఇప్పటికి చాలా తేడా ఉంది. ఆయన అక్క సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చివరి చూపునైనా దక్కేలా చేసినందుకు మావోయిస్టు పార్టీకి ధన్యవాదాలు చెప్పారు ఆర్కే సోదరి. అక్టోబర్‌ 15, 2004న ఆయన ప్రభుత్వంతో చర్చల కోసం అడవి నుంచి బయటకు వచ్చారు. సరిగ్గా 17 ఏళ్ల తర్వాత అదే రోజు ఆయన అంత్యక్రియలు జరిగాయి.

 

 

 

జనం కోసమే ఎర్ర జెండా పట్టారు… చివరి క్షణం వరకు జనం కోసమే బతికారు… చివరికి జనం కోసమే మరణించారు… మొత్తం జీవితాన్నే జనానికి అంకితం చేశారు… నవ సమాజ నిర్మాణం కోసం అడవుల్లోకి వెళ్లిన ఆర్కే… చివరికి ఆ అడవుల్లోనే కలిసిపోయారు. ఆర్కే ఉద్యమ ప్రస్థానాన్ని అతని కుటుంబ సభ్యులు, విప్లవకారులు గుర్తుచేసుకుంటున్నారు. ఆర్కే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ప్రజల కోసమే ఆర్కే తన ప్రాణాలు అర్పించారని ఆయన సతీమని శిరీష అన్నారు. ఉన్నత సమాజ నిర్మాణం కోసం పోరాడారని గుర్తుచేసుకున్నారు.

Also Read: ‘ఆపరేషన్ సమాధాన్‌’తోనే విప్లవ శిఖరం కుప్పకూలింది.. నట్టడివిలో గర్జన ఆగింది