RK dies: ‘ఆపరేషన్ సమాధాన్‌’తోనే విప్లవ శిఖరం కుప్పకూలింది.. నట్టడివిలో గర్జన ఆగింది

ఆపరేషన్‌ సమాధాన్‌తోనే ఆర్కే మరణాన్ని చూశారు చత్తీస్‌ఘడ్‌ పోలీసులు. పక్కా సమాచారంతో వ్యూహాన్ని అమలు చేశారు.

RK dies: 'ఆపరేషన్ సమాధాన్‌'తోనే విప్లవ శిఖరం కుప్పకూలింది.. నట్టడివిలో గర్జన ఆగింది
Rk Death


>> ఆర్కే మృతికి కారణం ఆపరేషన్ సమాధాన్‌ అంటున్న విప్లవ వర్గాలు
>> ఆర్కే అనారోగ్యంపై స్పష్టమైన సమాచారమున్న పోలీసులు
>> వారం నుంచి అడవిని చుట్టుముట్టిన పోలీసులు
>> వైద్యం అందకుండా చేసే ప్రయత్నంలో సఫలం
>> ఆపరేషన్ సమాధాన్‌ సక్సెస్‌గా చెబుతున్న చత్తీస్‌గఢ్
>> మావోయిస్టుల కంటే ముందుగా చెప్పడం వెనుక కారణం అదే
>> ప్రభుత్వ హత్యే అంటున్న భార్య శిరీష, విప్లవసంఘాలు

ఆపరేషన్‌ సమాధాన్‌తోనే ఆర్కే మరణాన్ని చూశారు చత్తీస్‌ఘడ్‌ పోలీసులు. అవును ఇదే విషయాన్ని విప్లవ సంఘాలు కూడా బలంగా చెబతున్నాయి. పక్కా సమాచారంతో వారు వ్యూహాన్ని అమలు చేశారని అంటున్నారు. ఆ తర్వాత మరణాన్ని నిర్థారించుకుని దాన్నో విజయంగా మీడియాకు చెప్పారట చత్తీస్‌ఘడ్ అధికారులు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్న ఆర్కే పరిస్థితి ఈ మధ్యకాలంలో మరింత విషమించింది. దానిపై చత్తీస్‌గడ్ పోలీసులకు పక్కా సమాచారం ఉంది. కరోనా టైమ్‌కు ముందు నుంచీ అమలు చేస్తున్న ఆపరేషన్ సమాధాన్‌ను ఆర్కే విషయంలో పక్కాగా అమలు చేశారు పోలీసులు. వెతుక్కుంటూ మావోయిస్టుల కోసమో, ఆర్కే కోసమో వెళ్లే కంటే.. బస్తర్‌, బీజాపూర్ అడవుల్లోకి వెళ్లే దారులను మూసేయడం మంచిదనుకున్నారు. బయటి వాళ్లను లోపలికి, లోపలివాళ్లను బయటకు రానివ్వకుండా అమలు చేస్తున్న ఆపరేషన్ సమాధాన్‌ను అప్లై చేశారు. వాళ్లు అనుకున్న ఫలితమే వచ్చింది. ట్రీట్‌మెంట్ అందక ఆర్కే చనిపోయాడు. ఇన్‌ఫార్మర్లతో పక్కా సమాచారం తెలుసుకుని, ధృవీకరించుకున్న తర్వాతే చత్తీస్‌గడ్ పోలీసులు ఆర్కే మరణాన్ని చెప్పారు. బహుశా.. మావోయిస్టులు ఆలస్యంగా నిర్దారించడం వెనుక కారణం కూడా ఆపరేషన్ సమాధానే కావచ్చు. విరసం నేతలతో పాటు పలువురు విప్లవ సంఘాలు నేతలు ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు.

Also Read: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతిని ధృవీకరించిన మావోయిస్టు పార్టీ..

Click on your DTH Provider to Add TV9 Telugu