Viral: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ఆస్పత్రికి మహిళ – జీఐ ఎండోస్కోపీ చేసి వైద్యులు షాక్

కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరింది మహిళ... తొలుత నార్మల్ టెస్టులన్నీ చేయగా వైద్యులు ఎలాంటి సమస్యా గుర్తించలేకపోయారు. దీంతో జీఐ ఎండోస్కోపి చేయగా ఆశ్చర్యం కలిగించిన విషయం బయటపడింది. ఆ పూర్తి డీటేల్స్ కథనం లోపల తెలుసుకుందాం పదండి .. ..

Viral: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ఆస్పత్రికి మహిళ - జీఐ ఎండోస్కోపీ చేసి వైద్యులు షాక్
Endoscopy

Updated on: Jul 25, 2025 | 3:29 PM

బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన 37 ఏళ్ల మహిళకు శ్వాస తీసుకోవడంలో అకస్మాత్తుగా ఇబ్బందులు వచ్చాయి. ఛాతీలో సైతం నొప్పి మొదలయింది. ఇంకా రకరకాలు లక్షణాలతో ఆమె చాలా వీక్ అయిపోయింది. దీంతో కుటుంబసభ్యులు దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ఆమెకు వివిధ రకాల పరీక్షలు చేశారు. అయినా సరే ఆమె పరిస్థితికి గల కారణం అంతుచిక్కలేదు. దీంతో జీఐ ఎండోస్కోపీ చేయగా అసలు విషయం తేలింది. ఆమె కడుపులో టూత్​ బ్రష్​ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సంజయ్​ బసు నేతృత్వంలోని వైద్యుల టీమ్.. దాదాపు 45నిమిషాల పాటు ఆపరేషన్ నిర్వహించి.. ఆ కడుపు నుంచి బ్రెష్ బయటకు తీశారు.

ఆస్పత్రికి వచ్చినప్పడు తాను ఏం మింగానో ఆ మహిళ చెప్పలేదని వైద్యులు తెలిపారు. జీఐ ఎండోస్కోపి ద్వారా కడుపులో బ్రెష్ ఉన్నట్లు గుర్తించామన్నారు. అసలు టూత్ బ్రెష్ ఆమె ఎందుకు మింగారో అంతుబట్టడం లేదని తెలిపారు. మహిళ కడుపులో ఉన్న బ్రష్‌ను బయటకు తీసేందుకు వైద్యులు ఎండోస్కోపీ చేశారు. అలా నోటి నుంచి ఒక సన్నటి దారాన్ని పంపించారు. ఆ తర్వాత దారాన్ని బ్రష్‌కు ముడివేసి తీసేందుకు ప్రయత్నించారు. మహిళకు మత్తు మందు ఇచ్చి ఈ ఆపరేషన్ చేశారు. టూత్​ బ్రష్​ అనేది నిటారుగా ఉండే వస్తువు కావడంతో బయటకు తీయడం కష్టంగా అనిపించిదని వెల్లడించారు.

బ్రష్‌ను అన్నవాహిక వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకురావచ్చు. కానీ అన్నవాహిక పైకి వచ్చాక లోపల శరీర నిర్మాణం కాస్త మెలికలుగా ఉంటుంది. ఇందుకోసం రోగి దవడను కాస్త పైకి ఎత్తి అన్నవాహిక వంకరగా ఉన్న ప్రాంతం కాస్త నిటారుగా అయ్యేలా చేసి.. శ్రమించి బ్రష్ బయటకు తీసినట్లు ఆపరేషన్ చేసిన వైద్యులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..