Bandla Ganesh: ఉత్తరప్రదేశ్ సీఎంతో బండ్ల గణేష్ మంతనాలు.. నువ్వు సూపరన్న అంటున్న నెటిజన్ల

Bandla Ganesh: టాలీవుడ్ (Tolly wood )నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ఎప్పుడూ ఏదొక విషయంలో సంచలనాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఓ వైపు సినిమాలకు సంబంధించిన విషయాలతో..

Bandla Ganesh: ఉత్తరప్రదేశ్ సీఎంతో బండ్ల గణేష్ మంతనాలు.. నువ్వు సూపరన్న అంటున్న నెటిజన్ల
Bandla Ganesh Meets Uprades

Updated on: Mar 27, 2022 | 9:40 AM

Bandla Ganesh: టాలీవుడ్ (Tolly wood )నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ఎప్పుడూ ఏదొక విషయంలో సంచలనాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఓ వైపు సినిమాలకు సంబంధించిన విషయాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు రాజకీయనేతలతో మంతనాలు నెరుపుతునే ఉంటాడు బండ్ల గణేష్.. లోకల్ పాలిటిక్స్ లో అడుగు పెట్టి సందడి చేసిన గణేష్.. చాలా సార్లు ఇబ్బందుల్లో పడ్డారు. కోరి సమస్యలను కొని తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించినట్లు ఉంది. తాజాగా యూపీ (Uttarpradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanatha) ను కలిసి మంతనాలు మొదలెట్టాడు.  గ‌తంలో ప‌లువురు కీల‌క నేత‌ల‌తో ఇలా వెళ్లి అలా క‌లిసి వ‌చ్చిన ఆయ‌న తాజాగా.. ఉత్తర‌ప్రదేశ్‌కు వ‌రుస‌గా రెండో సారి సీఎంగా ప‌ద‌వీ ప్రమాణం చేసిన యోగి ఆదిత్యనాథ్‌తో క‌లిసి ఫొటో దిగారు.

సీఎం యోగితో ఉన్న ఫోటోను బండ్ల గ‌ణేశ్ త‌న ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. యూపీ కి వరసగా రెండోసారి సీఎంగా పదవీ బాధ్యత‌లు చేప‌ట్టిన యోగి ఆదిత్యనాథ్‌కు శుభాకాంక్షలు చెప్పాడు. ఆ ప‌రమేశ్వరుడు ఆయ‌న‌కు ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించాల‌ని ఆకాంక్షించారు. ఈ ఫొటోను చూసిన వారు బండ్ల గ‌ణేశ్‌ రాజకీయంగా మంచి సంబంధాలే నెర‌పుతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. బండ్లన్నా నువ్వుసూపర్ అంటున్నారు.

 

Also Read: Pink & Yellow Tomatoes: త్వరలో మార్కెట్ లోకి పింక్, పసుపు టొమాటోలు.. మరింత టేస్టీగా మారనున్న కూరలు

Viral Video: కచ్చ బాదం డ్యాన్స్‌ ఇలాగా మీరెప్పుడు చూసి ఉండరు !!