నేడు ఏవోబీ బంద్‌కు మావోయిస్టుల‌ పిలుపు.. వాహ‌నాల య‌జ‌మానులు స‌హ‌క‌రించాలి: మావోయిస్టు నేత కైల‌సం

|

Dec 21, 2020 | 6:59 AM

బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా ఏవోబీలో బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. తాజాగా మావోయిస్టులు ఆడియో టేపు విడుదల చేశారు. ఏవోబీ ఎస్ జెడ్ సీ అధికార ప్రతినిధి కైలసం....

నేడు ఏవోబీ బంద్‌కు మావోయిస్టుల‌ పిలుపు.. వాహ‌నాల య‌జ‌మానులు స‌హ‌క‌రించాలి: మావోయిస్టు నేత కైల‌సం
Follow us on

బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా ఏవోబీలో బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. తాజాగా మావోయిస్టులు ఆడియో టేపు విడుదల చేశారు. ఏవోబీ ఎస్ జెడ్ సీ అధికార ప్రతినిధి కైలసం పేరుతో ఈ ఆడియో టేపు విడుదలైంది. బూటకపు ఎన్ కౌంటర్లు, అక్రమ అరెస్టు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.దీంతో పోలీసుల తీరుకు నిరసనగా సోమవారం ఏవోబీ బంద్ కు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

సింగవరంలో మల్లేశం, శాంతమ్మలను కాల్చి చంపారని, గిరిజనులను బలవంతంగా అదుపులోకి తీసుకుని సరెండర్లు చేయిస్తున్నారని ఆరోపించారు. వారు లొంగకపోతే ఎన్ కౌంటర్లు చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. ప్రజా ఉద్యమాలు చేసేవారిని అక్రమ అరెస్టు చేస్తున్నారని మావోయిస్టు నేత కైలసం ఆరోపించారు. ఉద్యమాన్ని అణిచివేయాలని ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు కలలు కంటున్నాయని, సోమవారం బంద్ కు ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల యజమానులు సహకరించాలని కోరారు.

కాగా, గత వారంరోజుల కింద‌ట ఆంధ్ర‌-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టులు, పోలీసుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. స‌రిహ‌ద్దుల్లోని సింగారం అట‌వీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతుండ‌గా, మావోయిస్తులు తార‌స‌ప‌డ్డారు. దీంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో మ‌ర‌ణించిన వారిలో ఏరియా క‌మిటీ స‌భ్యుడు కూడా ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. సంఘ‌ట‌న స్థ‌లంలో ఆయుధాలు, ఇత‌ర వ‌స్తువుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.