Teera Kamat: చిన్నారి కోసం రూ. 6 కోట్లు మాఫీ.. ప్రధాని మోదీపై ప్రశంసలు.. అసలు ఏం జరిగిందంటే.!

|

Feb 12, 2021 | 1:46 PM

Teera Kamat: తీరా కామత్ అనే 5 నెలల చిన్నారి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఓ నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు...

Teera Kamat: చిన్నారి కోసం రూ. 6 కోట్లు మాఫీ.. ప్రధాని మోదీపై ప్రశంసలు.. అసలు ఏం జరిగిందంటే.!
Follow us on

Teera Kamat: తీరా కామత్ అనే 5 నెలల చిన్నారి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఓ నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి.? ఆయన ఎందుకు తీసుకున్నారు.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐదు నెలల చిన్నారి తీరా కామత్ వెన్నెముక కండరాల బలహీనతతో బాధపడుతోంది. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ చిన్నారికి స్పైనల్ మస్కుల్ర్ అట్రోఫి(SMA) అనే అరుదైన వ్యాధి సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. ఈ వ్యాధిని నయం చేయడానికి కావాల్సిన జోల్ జెన్ స్మా అనే ప్రత్యేక ఇంజక్షన్ విదేశాల్లో మాత్రమే దొరుకుతుంది. ఇక దాని విలువ అక్షరాల రూ. 16 కోట్లు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులు దాదాపు రూ. 12 కోట్ల వరకు విరాళాల రూపంలో సేకరించారు. అయితే మెడిసిన్‌కు కావాల్సిన మొత్తం అమౌంట్ మాత్రం సద్దుబాటు కాలేదు.

ఇదిలా ఉంటే అవసరమయ్యే ఇంజెక్షన్‌పై దిగుమతి సుంకం, జీఎస్టీ విధిస్తే.. మరింత అదనపు భారం పడుతుందని.. వాటిని మినహాయిస్తే తమ కూతురుకు వైద్యం అందుతుందని చిన్నారి తల్లి ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించి కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఆయా మెడిసిన్స్‌పై నిబంధనలు మార్చాలంటూ అధికారులను ఆదేశించారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!

తనకున్న వ్యాధిపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కాజల్.. షాక్‌లో ఫ్యాన్స్.!