బెంగాల్ లో సీబీఐ కార్యాలయంపై టీఏంసీ కార్యకర్తల రాళ్లవర్షం , అధికారుల అరెస్టుకు డిమాండ్, సీఎం మమతపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు

నారదా లంచం కేసులో మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్ మిత్రాలను సీబీఐ అధికారులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కోల్ కతా లో..

బెంగాల్ లో సీబీఐ కార్యాలయంపై టీఏంసీ కార్యకర్తల రాళ్లవర్షం , అధికారుల అరెస్టుకు డిమాండ్, సీఎం మమతపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు

Edited By:

Updated on: May 17, 2021 | 4:17 PM

నారదా లంచం కేసులో మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్ మిత్రాలను సీబీఐ అధికారులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కోల్ కతా లో ఈ దర్యాప్తు సంస్థ కార్యాలయం ముందు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి ఆందోళనకు దిగారు. తమ మంత్రులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ వారు ఈ ఆఫీసుపైకి రాళ్లవర్షం కురిపించారు. అసలు సీబీఐ అధికారులనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. మా మంత్రులను అరెస్టు చేసిన వీరిపై చర్యలు తీసుకోవాలని నగర పోలీసులను కోరారు. పోలీస్ కమిషనర్ కు కూడా వీరు లేఖ రాస్తూ బీజేపీ, గవర్నర్ సలహాపై సీబీఐ ఇలా కక్ష సాధింపునకు దిగుతోందన్నారు. వీరి ఆందోళనతో ఈ కార్యాలయ ప్రధాన గేటును మూసివేశారు. కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను నియమించారు.
అటు-నగరంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయని గవర్నర్ ధన్ కర్ ట్వీట్ చేశారు. సీఎం మమత ఆధ్వర్యంలో హింస జరుగుతోందని పరోక్షంగా ఆరోపించారు. ఇక బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ …మమతా బెనర్జీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు., రాష్ట్రంలో హింసను ఆమె రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ కారణంవల్లే పాలక తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు సిబిఐ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారని ఆయన తన ఫిర్యాదులో ప్రస్తావించారు. టీఎంసీ ఎంపీ అభిషేక్ ముఖర్జీ..ప్రతివారూ చట్టానికి లోబడి ఉండాలని కోరుతూనే.. న్యాయవయవస్థ పట్ల తమకు విశ్వాసం ఉందని, లీగల్ గా పోరాడుదామని పేర్కొన్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Shekar Master: డ్యాన్సర్‌లందరికీ నేనున్నా… ఉపాధి కోల్పోయిన వారికి ఉచితంగా… ( వీడియో )

Viral Video: ఆకాశం నుంచి ఎలుకల వర్షం వట్టి భ్రమేనా..?? అసలు విషయమేమిటంటే… ( వీడియో )