ఊపిరిపీల్చుకున్నంత హాయిగా ఉంది.. రాజ్యసభ సాక్షిగా రాజీనామా చేసిన రైల్వేశాఖ మాజీ మంత్రి, సీఎం మమతకి మరో షాక్.!

|

Feb 12, 2021 | 3:55 PM

బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతోన్న వేళ తృణమూల్‌ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎంపీ, మాజీ కేంద్ర..

ఊపిరిపీల్చుకున్నంత హాయిగా ఉంది.. రాజ్యసభ సాక్షిగా రాజీనామా చేసిన రైల్వేశాఖ మాజీ మంత్రి, సీఎం మమతకి మరో షాక్.!
Follow us on

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతోన్న వేళ తృణమూల్‌ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎంపీ,  రైల్వేశాఖ మాజీ మంత్రి దినేశ్‌ త్రివేది సీఎం మమతా బెనర్జీకు షాకిచ్చారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తునట్టు రాజ్యసభ సాక్షిగా ప్రకటించారు. బెంగాల్‌లో అరాచకం రాజ్యమేలుతోందని, హింసా రాజకీయాలను తట్టుకోలేక ఎంపీ పదవికి రాజీనామా చేస్తునట్టు దినేశ్‌ త్రివేది ప్రకటించారు. రాజీనామా ప్రకటన తనకు ఊపిరిపీల్చుకుంటున్నట్టు అనిపిస్తుందని ఆయన ప్రకటించడం విశేషం. బెంగాల్‌లో శాంతిని నెలకొల్పడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తానని త్రివేది చెప్పారు.

బడ్జెట్ పై రాజ్యసభలో జరుగుతున్న చర్చ సందర్భంగా ప్రసంగిస్తున్న త్రివేది తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. తన రాష్ట్రంలో జరుగుతున్న హింసను చూసిన తరువాత, తన “మనస్సాక్షిని” అనుసరించాల్సి వచ్చిందని, అందుకే రాజీనామా చేస్తున్నానని త్రివేది సభకు తెలిపారు. అయితే, తన బెంగాల్ కోసం, దేశం కోసం పని చేస్తానని ఆయన చెప్పారు. శుక్రవారం రాజ్యసభలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా, త్రివేది త్వరలో బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.

Read also : భారతీయ వేతన జీవులకు ఒక గుడ్ న్యూస్, ఈ ఏడాది జీతాలు పెరుగుతాయట, అది ఏమేరకు..? అంటే..!