Sonia Gandhi – 19-Party Meet: పడిపోయిన మోదీ గ్రాఫ్. కాంగ్రెస్‌లో మళ్లీ ఆశలు. మిషన్ 2024 టార్గెట్‌గా వ్యూహాలు. సీన్‌లోకి పీకే ఏంట్రీ. మరి నెక్ట్స్ ఏంటి? సోనియా అధ్యక్షతన జరిగిన మెగా అపోజిషన్ మీటింగ్ దేనికి సంకేతం? మళ్లీ తెరపైకి వచ్చిన థర్డ్‌ఫ్రంట్ స్వరాలు..ఈసారైనా సక్సెస్ అవుతాయా? థర్డ్‌ఫ్రంట్ PM అభ్యర్థి ఎవరు? కాంగ్రెస్ నావను నడిపించేదెవరు? మోదీ అండ్ టీమ్‌ను ఎదుర్కొనేందుకు అపొజిషన్ పార్టీలు ఏం చేయబోతున్నాయి.?
ప్రస్తుతం కాంగ్రెస్ ముందు మూడు ముఖ్యమైన టార్గెట్లు ఉన్నాయి. మొదటిది విపక్షాలను ఏకతాటిపైకి తేవడం. రెండోది కేంద్రంపై మూకుమ్మడిగా పోరాటం ఉద్ధృతం చేయండి. మూడోది వచ్చే ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిని ఓడించి అధికారంలోకి రావడం. ఈ మూడు లక్ష్యాలే టార్గెట్ పనిచేస్తోంది కాంగ్రెస్. అందుకే కొన్ని రోజులుగా ఆ పార్టీ ఐక్యతారాగం వినిపిస్తోంది. ఓ మెట్టుదిగి మరి అందరినీ కలుపుకుపోవాలని ప్రణాళికలు వేస్తోంది. అందులోభాగమే ఈ వర్చువల్ సమావేశం. ఈ మెగా అపోజిషన్ టీం మీటింగ్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఓ హాట్‌టాఫిక్. అయితే ఈ సమావేశానికి ఆప్, ఆకాలీదళ్‌కు మాత్రం ఆహ్వానాలు అందలేదు. ఆర్థిక మందగమనం, కొవిడ్ వైఫల్యాలు, పెగాసస్ స్పైవేర్ వివాదం, రైతువ్యతిరేక చట్టాలు.. ఆందోళనలు వంటి కీలక అంశాలపై చర్చించారు. ప్రజాక్షేత్రంలో బీజేపీకి వ్యతిరేకంగా సాగించాల్సిన ఉమ్మడిపోరాటాలపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ముందుండి నడిపించే నాయకుడు లేక కొట్టుమిట్టాడుతోంది. ఈ వయసులోనూ సోనియాగాంధే తప్పనిసరి పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిన దుస్థితి. వరుసగా రెండోసారి కూడా NDA కూటమి చేతిలో ఘోరపరాభవం తర్వాత పార్టీలో అసమ్మతి పెరిగిపోయింది. ముఖ్యంగా సీనియర్లు బహిరంగంగానే పార్టీ పరిస్థితిపై వ్యాఖ్యలు చేయడం చాలా ఇబ్బందికరంగా మారింది. జీ 23గా ప్రాచుర్యం పొందిన 23 మంది సీనియర్ నేతలూ ఇప్పటికీ సూటిపోటిమాటలతో పార్టీలోని లోపాలపై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. ఇలా ఏరకంగా..ఎటు వైపు నుంచి చూసిన కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒంటరిగా NDAను, మోదీ-షా ద్వయాన్ని ఢీకొట్టడం అసాధ్యమన్న విషయం కాంగ్రెస్ అర్థమైంది. అందుకే విపక్షాలను ఏకం చేసే పనిలో పడింది. థర్డ్‌ఫ్రంట్ స్వరాలను వినిపిస్తోంది. వరుస భేటీలు నిర్వహిస్తోంది.
ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ తర్వాత కాంగ్రెస్ మళ్లీ కాస్త జోష్ పెరిగినట్లు కనిపిస్తోంది.. ఇటీవల రాహుల్, ప్రియాంక గాంధీలతో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని…ప్రచారవ్యూహాల్లో కీ రోల్ పోషిస్తారన్న వార్తలు వచ్చాయి. అప్పటి నుంచే అందరినీ ఏకం చేసేపనిని భుజానికెత్తుకున్నారు పీకే..2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలుపెట్టారు.. వాస్తవానికి యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ధర్డ్ ప్రంట్ యత్నాలు ముమ్మరం చేశారు. కానీ సాధ్యపడలేదు.. అయితే ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మళ్లీ ఆశలు చిగురించాయి. జూన్ 22న NCP అధినేత శరద్ పవార్ నివాసంలో 8 పార్టీల నేతలు భేటీ అయ్యారు.
ఐదు రాష్ట్రాల రిజల్ట్స్ తర్వాత ప్రశాంత్ కిశోర్ మరింత దూకుడుగా వెళ్తున్నారు. నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు…వెస్ట్ బెంగాల్‌లో మమత, తమిళనాడులలో స్టాలిన్ విజయాలకు వ్యూహకర్తగా వ్యవహరించారు పీకే. ఆ రెండు చోట్ల బ్రహ్మాండమైన విజయాలు సొంతమయ్యాయి. అందుకే మరోసారి థర్డ్‌ఫ్రంట్ తెరపైకి వచ్చింది…కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు సీట్ల లక్ష్యాలను నిర్దేశించుకుని సాగాలన్న ఆలోచనతో ముందుకువెళ్తున్నారు. ఇలా పక్కా ప్లాన్‌తో వెళ్తేనే NDA ఢీకొట్టగలమన్నది మెజార్టీ నేతల మాట.. ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం 543 సీట్లు ఉన్నాయి. మెజార్టీకి కావాల్సిన కనీస సీట్ల సంఖ్య 273.కాంగ్రెస్ కనీసం 136 సీట్లు … మిగిలిన బీజేపీయేతర పార్టీలు 137 స్థానాల్లో గెలిస్తే టార్గెట్‌ను రీచ్ కావొచ్చన్నది పీకే స్కెచ్.
ఓ సారి గతాన్ని పరిశీలిస్తే ఈ థర్డ్‌ఫ్రంట్ అనుభవాలు పెద్దగొప్పగా ఏమీ లేవు..1989-91 మధ్య వీపీ సింగ్, ఎన్టీఆర్ సారధ్యంలో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ కూటమి బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1996-98 మధ్య జనతాదళ్, సమాజ్‌వాది పార్టీ, టీడీపీ, సీపీఎం వంటి 13 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. 2019 ఎన్నికల ముందు కూడా మమతా బెనర్జీ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు జోరుగానే సాగాయి.. జనవరిలో కోల్‌కతాలో టీఎంసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏకంగా 22 పార్టీల నేతలు హాజరయ్యారు. కానీ ఈప్రయత్నాలేవీ కార్యరూపం దాల్చలేదు..మరి ఇప్పుడు పీకే డైరెక్షన్‌లో వినిపిస్తున్న ఈ థర్డ్‌ఫ్రంట్ స్వరాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయి.? పీకే లెక్కలు, వ్యూహాలు థర్డ్ ఫ్రంట్‌ను విజయతీరానికి చేరుస్తాయా? ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ అండ్ టీమ్ రాష్ట్రాల్లోనే పనిచేశాయి. మరి జాతీయస్థాయిలో ఆ లెక్కలు వర్కౌట్ అవుతాయా? అంతమంది నేతలు.. పార్టీలను ఏకటిపైకి తెచ్చి.. ఒకే గళం వినిపించడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి..
అటు ప్రధాని మోదీ గ్రాఫ్ తగ్గిందన్న సర్వేలు కూడా థర్డ్‌ప్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో మరికాస్త జోష్‌ను నింపుతున్నాయి…ఆగస్టు 2020లో 66 శాతంగా మోదీ గ్రాఫ్ జనవరి, 2021లో 38 శాతానికి తగ్గిపోయింది. ఆగస్టు నాటికి అది కేవలం 26 శాతానికి పడిపోయిందని అంటోంది ఇండియా టుడే సర్వే .దేశ ఉత్తమ ప్రధానిగా 24 శాతం మంది మోదీకి మద్దతు తెలిపారు.. 11 శాతంతో మోదీ తర్వాతి స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉండగా..రాహుల్ గాంధీకి 10 శాతం మద్దతు లభించింది…గతే ఏడాదితో పోలిస్తే రాహుల్ పాపులారిటీ 2శాతం పెరిగింది. సో.. మొత్తానికి ప్రస్తుతం కాంగ్రెస్‌కు కొంత పాజిటివిటీ కనిపిస్తోందన్నది ఆ పార్టీ నేతల మాట. మరి 2024కు వరకు ఎలాంటి మార్పులు చేసుకుంటాయి.? ఈ ఐక్యతా పోరాటం ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది వెయిట్ అండ్ సీ.
With the initiative of Smt Sonia ji Gandhi an online meeting of like minded parties was held today.
I truly appreciate the steps taken to organise this much needed meeting in view of the present circumstances in our country. The current scenario in India appears very gloomy. pic.twitter.com/rWUI5Fs1uc— Sharad Pawar (@PawarSpeaks) August 20, 2021
Read also: Palamuru Ladies: పాలమూరు మహిళా సమాఖ్యల గిన్నీస్ రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్