అయోధ్యలో రామాలయం కింద ‘టైమ్ క్యాప్స్యూల్’!

అయోధ్యలో రామజన్మ భూమికి సంబంధించిన చరిత్రాత్మక వాస్తవాలు, విశేషాలను తెలిపే టైమ్ క్యాప్స్యూల్ ను ఆలయ నిర్మాణ స్థలి కింద సుమారు రెండు వేల అడుగుల లోతున ఉంచనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో..

అయోధ్యలో రామాలయం కింద టైమ్ క్యాప్స్యూల్!

Edited By:

Updated on: Jul 27, 2020 | 9:55 AM

అయోధ్యలో రామజన్మ భూమికి సంబంధించిన చరిత్రాత్మక వాస్తవాలు, విశేషాలను తెలిపే టైమ్ క్యాప్స్యూల్ ను ఆలయ నిర్మాణ స్థలి కింద సుమారు రెండు వేల అడుగుల లోతున ఉంచనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి వివాదం తలెత్తదని రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ తెలిపారు. రామజన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టులో దీర్ఘకాలం కొనసాగిన కేసు..ప్రస్తుత, రానున్న తరాలకు ఓ గుణపాఠం చెబుతుందని ఆయన అన్నారు. ఆలయ నిర్మాణ స్థలం కింద ఇన్ని వేల అడుగుల లోతున ఓ తామ్రపత్రంలో ఈ క్యాప్స్యూల్ ని ఉంచుతామని. భూమిపూజ రోజున అభిషేకం కోసం దేశవ్యాప్తంగా ఉన్న పవిత్ర నదుల నుంచి జలాన్ని, మట్టిని తెస్తామని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 5 న ప్రధాని మోదీ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఇందుకు సన్నాహాలు అప్పుడే మొదలయ్యాయి.