పేరుమోసిన వేటగాడు హబీబ్ తాలూక్ దర్ చివరకు పట్టుబడ్డాడు. 70 బెంగాల్ టైగర్స్ ను చంపిన ఇతడిని బంగ్లాదేశ్ పోలీసులు అతికష్టం మీద అరెస్టు చేశారు. పులులను చంపడమే తన హాబీగా పెట్టుకున్న 50 ఏళ్ళ ఇతడిని ‘టైగర్ హబీబ్’ అని కూడా పిలుస్తుంటారట. భారత-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని సుందర్ బన్ అటవీ ప్రాంతంలో నివసించే ఇతడికోసం పోలీసులు 20 ఏళ్లుగా గాలిస్తున్నారు. అతని ఇంటిపై ఎప్పుడు దాడి చేసినా తప్పించుకుని పారిపోయేవాడని బంగ్లా పోలీసు అధికారి సైదుర్ రెహమాన్ తెలిపారు. చివరకు ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అతడిని అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. ఈ అటవీ ప్రాంతంలో బెంగాల్ టైగర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ పులుల ఎముకలు, పంజాలు, మాంసం సైతం బ్లాక్ మార్కెట్లో కొందరు వ్యాపారులు సేకరించి చైనా. మరికొన్ని దేశాలకు అమ్ముతుంటారని ఆ పోలీసు అధికారి చెప్పారు. బహుశా హబీబ్ కూడా ఇలా వారికి తాను చంపిన పులుల అవశేషాలను ఇచ్చేవాడని భావిస్తున్నామన్నారు. మొదట అడవుల్లో తేనె పట్టుల నుంచి తేనెను సేకరిస్తూ వచ్చిన హబీబ్.. ఆ తరువాత పులుల చంపడమే పనిగా పెట్టుకున్నాడట.ఇతడంటే తమకు చాలా భయమని, కానీ గౌరవం కూడా ఉందని స్థానికుడొకరు చెప్పారు.
హబీబ్ చాలా డేంజరస్ వ్యక్తి..అని… వట్టి చేతులతోనే పులులను చంపేవాడని ఆయన చెప్పాడు.కాగా- బెంగాల్ టైగర్ల సంఖ్య చాలా తగ్గిపోయింది. 2004 లో ఇవి 440 ఉండగా 2015 నాటికి ఈ సంఖ్య 106 కి తగ్గింది. అటు- ముఖ్యంగా విదేశాల్లో పులుల మాంసానికి డిమాండ్ చాలా ఉందని, దీన్ని తినడంవల్ల తాము కూడా బలం పెంచుకోగల్గుతామని చాలామంది భావిస్తారట.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : ఓనర్స్ పనితో షాక్‌తిన్న కుక్కపిల్ల…నవ్వులే నవ్వులే ..వైరల్ అవుతున్న వీడియో : Dog funny video viral.
యూపీలో అనాముషం..డెడ్ బాడీ నదిలో పడేస్తూ వీడియోకు పోజులు ఇచ్చిన యువకులు: vial video.