నీటి తొట్టిలో జలకాలాడుతున్న పులి.. వైరల్ అవుతోన్న వీడియో.. రకరకాల కామెంట్స్‌తో..

|

Dec 13, 2020 | 10:13 AM

తెలంగాణలోని కొముం భీం అసిఫాబాద్‌ జిల్లాలో పెద్దపులి మనుషులపై దాడి చేస్తుంటే ఢిల్లీలో ఓ పులి టబ్‌లోకి దిగి జలకాలాడుతోంది. ఆశ్చర్యంగా ఉన్నా

నీటి తొట్టిలో జలకాలాడుతున్న పులి.. వైరల్ అవుతోన్న వీడియో.. రకరకాల కామెంట్స్‌తో..
Follow us on

తెలంగాణలోని కొముం భీం అసిఫాబాద్‌ జిల్లాలో పెద్దపులి మనుషులపై దాడి చేస్తుంటే ఢిల్లీలో ఓ పులి టబ్‌లోకి దిగి జలకాలాడుతోంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పులి టబ్‌లో స్నానం చేసే వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు వీడియో చూసి వింత వింత కామెంట్స్‌ పోస్ట్ చేస్తున్నారు.

కర్ణాటకలోని కొడగులో ఓ ఇంటి యజమాని పశువుల కోసం నీళ్ల టబ్ ఏర్పాటుచేశాడు. అయితే ఆ చుట్టుపక్కల సంచరిస్తున్న పులి అటుగా వచ్చింది. టబ్ చుట్టూ తిరుగుతూ ఎవరైనా ఉన్నారా అని పరిశీలించింది. ఎవరూ లేరని నిర్ణయించుకొని టబ్‌లో దిగి జలకాలాడటం ప్రారంభించింది. అంతేకాకుండా ఎవరైనా వస్తే పారిపోవడానికి సిద్దంగా ముందు కాళ్లను రెడీ గా ఉంచుకొంది. ఈ పులి వీడియోను కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. దీంతో స్పందించిన ఆనంద్ మహీంద్రా కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.