Encounter: కుప్వారాలో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం.. కొనసాగుతున్న సెర్చింగ్..
కుప్వారా (Kupwara) జిల్లాలోని జుమాగండ్ గ్రామంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో.. స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
Jammu Kashmir encounter: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతుంది. కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. కుప్వారా (Kupwara) జిల్లాలోని జుమాగండ్ గ్రామంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో.. స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు.. భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ గురువారం ఉదయం వెల్లడించారు. ఉగ్రవాదులను పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. వారు ఎవరనేది తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కుప్వారాలో ఇంకా భద్రతా బలగాల సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా.. బుధవారం రాత్రి బుద్గాం జిల్లా చదూరలో ఉగ్రవాదులు దురాఘతానికి పాల్పడ్డారు. టీవీ నటిని కాల్చి చంపారు. రాత్రి 8 గంటల సమయంలో టీవీ నటి అమ్రీన్ భట్ తన మేనల్లుడు ఫర్హాన్ జుబైర్ (10)తో కలిసి ఇంటి బయట ఉండగా కాల్పులు జరిపారు. దీంతో ఆమె మరణించగా, జుబైర్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదిలాఉంటే.. నిన్న జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగని ఎన్‌కౌంటర్లో పాకిస్థాన్ నుంచి వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారంతా జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో జమ్మూ కాశ్మీర్ పోలీసు జవాన్ కూడా వీరమరణం పొందాడు.
#KupwaraEncounter | All three terrorists were neutralized, affiliated with proscribed terror outfit LeT. Identification being ascertained. Incriminating materials including arms & ammunition recovered: IGP Kashmir
(File pic) pic.twitter.com/TcoqzExQ8Y
— ANI (@ANI) May 26, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..