మూడు పోలీస్‌ స్టేషన్ల నుంచి పోలీసులు వచ్చి.. ఓ పేదింట్లో పెళ్లికి కాపలా! ఎందుకంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఒక వివాహం సందర్భంగా పాత శత్రుత్వం కారణంగా తలెత్తిన తీవ్రమైన గొడవలను అదుపులో ఉంచుకునేందుకు మూడు పోలీస్ స్టేషన్ల పోలీసులు కృషి చేశారు. వివాహ ఊరేగింపులో జరిగిన హింసాత్మక ఘటనల తరువాత, పోలీసులు రాత్రంతా భద్రత కల్పించి వివాహం పూర్తి కావడానికి సహాయపడ్డారు.

మూడు పోలీస్‌ స్టేషన్ల నుంచి పోలీసులు వచ్చి.. ఓ పేదింట్లో పెళ్లికి కాపలా! ఎందుకంటే..?
Up Police

Updated on: Apr 27, 2025 | 6:22 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో మూడు పోలీస్ స్టేషన్ల పర్యవేక్షణలో ఒక వివాహం ఘనంగా జరిగింది. దుల్లాపూర్ ప్రాంతంలోని ఖుదాబక్ష్ పూర్ గ్రామానికి వచ్చిన వివాహ ఊరేగింపులో డిజె పాటలకు నృత్యం చేయడం, పాత శత్రుత్వం కారణంగా బరాతీలు, వధువు తరుపు బృందం మధ్య వివాదం చెలరేగింది. చిలికి చిలికి గాలివానలా మారింది. గొడవ పెద్దది కావడంతో సమాచారం అందుకున్న మూడు పోలీస్ స్టేషన్ల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, రాత్రంతా నిఘా ఉంచి వివాహం పూర్తయ్యేలా చూశారు. శుక్రవారం రాత్రి జంగీపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కుక్వాకు చెందిన భితా మౌజ్ నుండి ఘాజీపూర్‌లోని దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఖుదాబక్ష్ పూర్ గ్రామానికి వివాహ ఊరేగింపు వచ్చింది.

పెళ్లి ఊరేగింపులో పెళ్లికి వచ్చిన అతిథులు డీజేపై నృత్యం చేస్తున్నారు. ఇంతలో పాత శత్రుత్వం, డీజేపై నృత్యం చేయడం కారణంగా వరుడి తరపు వారికి, వరుడి తరపు వారికి మధ్య తీవ్ర పోరాటం జరిగింది. ఈ గొడవలో కొంతమంది వివాహ బృందానికి చెందిన 10 వాహనాల అద్దాలను పగలగొట్టారు. ఈ దాడి ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటనపై దుల్లాపూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. ఆ తర్వాత దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు మరో రెండు పోలీస్ స్టేషన్ల పోలీసులతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. వధువు, వరుడి వైపు వారితో పోలీసులు మాట్లాడి, వారిని శాంతిపజేసి.. రాత్రి అంతా అక్కడ కాపలా కాసి పెళ్లి అయితే జరిపించారు. పోలీసులే దగ్గరిండి.. అప్పగింతల కార్యక్రమం నిర్వహించి, పెళ్లి కొడుకుతో పెళ్లి కూతుర్ని పంపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..