చెదరిన డాక్టర్ కల.. ముగ్గురు NEET విద్యార్ధులు బలి!

NEET-UG పరీక్ష రద్దుతో మనస్తాపం చెంది పలువురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీకి చెందిన రితిక్ మిశ్రా గురువారం (మే 14) ఆత్మహత్య చేసుకున్నాడు. మూడోసారి నీట్ రాసిన రితిక్‌ ఈసారి ఖచ్చితంగా ర్యాంకు సాధిస్తానని నమ్మకంగా ఉన్న విద్యార్ధి అనూహ్య పరిణామంతో..

చెదరిన డాక్టర్ కల.. ముగ్గురు NEET విద్యార్ధులు బలి!
NEET aspirants died by suicide

Updated on: May 15, 2026 | 8:57 PM

రాజస్థాన్, మే 15: పేపర్ లీక్‌ నేపథ్యంలో నీట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. NEET-UG పరీక్ష రద్దుతో మనస్తాపం చెంది పలువురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీకి చెందిన రితిక్ మిశ్రా గురువారం (మే 14) ఆత్మహత్య చేసుకున్నాడు. మూడోసారి నీట్ రాసిన రితిక్‌ ఈసారి ఖచ్చితంగా ర్యాంకు సాధిస్తానని నమ్మకంగా ఉన్నాడు. అయితే అనూహ్యంగా నీట్‌ పరీక్ష రద్దవడంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

రాజస్థాన్‌లోని సీకర్‌లో విద్యార్ధి బలి

నీట్ సెగకు రాజస్థాన్‌లోని సీకర్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. NEET-UG పరీక్ష రద్దుతో మనస్తాపం చెంది విద్యార్థి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ కోచింగ్ తీసుకుంటున్న ప్రదీప్.. అద్దె గదిలో ఉరివేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు. పరీక్షలో 650 మార్కులు వస్తాయని ఆశించిన విద్యార్థి.. రద్దు వార్తతో తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడు. వ్యవస్థ వైఫల్యం వల్లే తమ బిడ్డ ప్రాణం పోయిందని తల్లిదండ్రుల కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసిన ఉద్యోగ్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

న్యూఢిల్లీలో మరో దారుణం

గత కొన్నేళ్లుగా నీట్ కోసం సన్నద్ధమవుతున్న 20 ఏళ్ల యువతి వాయువ్య ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌లో తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలంలో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించనప్పటికీ, జాతీయ ప్రవేశ పరీక్ష రద్దు కావడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇలాంటి కేసుల్లోని చట్టపరమైన లాంఛనాల గురించి తమకు తెలియదని చెబుతూ, అధికారులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లి ఖననం చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా నీట్‌ యూజీ 2026 పరీక్ష మే 3న నిర్వహించగా.. దేశ వ్యాప్తంగా మొత్తం 23లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే పేపర్ లీక్ ఆరోపణలతో ఎగ్జాం రద్దు చేశారు. జూన్ 21న తిరిగి నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఈ రోజు కేంద్రం ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us