ఫ్రాన్స్ నుండి మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాకు రానున్నాయి. ఈ మూడింటింతో కలిపి భారత్‌లో రఫెల్ యుద్ధవిమానాల సంఖ్య 29కి చేరనుంది. ఉత్తర సరిహద్దులు, తూర్పు సరిహద్దులలో వీటిని మోహరించనున్నారు. తూర్పు లఢఖ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అత్యధునిక యుద్ధ విమానాలు రాఫెల్స్‌ను కూడా రక్షణ కోసం సరిహద్దులోకి మోహరించారు. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ ఏమాత్రం వక్రబుద్ధి చూపించినా.. తగిన బుద్ధి చెప్పేందుకు, వారి ఆట కట్టించేందుకు భారత ఆర్మీ, భారత వాయుసేన ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి.
మొదటి విడతలో ఐదు రఫెల్ యుద్ధ విమానాలు 2020 జూలై 20న ఇండియాకు చేరుకున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ఏడాది జూలై 28 న ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ (EAC) లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హసిమారాలో నంబర్ 101 స్క్వాడ్రన్‌లో రాఫెల్ విమానాన్ని లాంఛనంగా ప్రవేశపెట్టింది.101 వ రఫేల్ విమానాలను కలిగి ఉన్న రెండవ IAF స్క్వాడ్రన్.
ఆత్యాధునిక 36 రాఫెల్స్‌ను రూ.59,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు భారత్, ఫ్రాన్స్ మధ్య 2016లో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తొలి బ్యాచ్‌గా ఐదు రాఫెల్ జెట్స్ భారత్‌కు చేరాయి. ఇంకా 31 యుద్ధ విమానాలు భారతదేశానికి రావాల్సి ఉంది. ఇప్పుడు రెండో విడతలో మరికొన్ని విమానాలు దేశానికి చేరనున్నాయి. ఇదిలాఉంటే.. 2023 నాటికి ఐఏఎఫ్‌లో మొత్తం 36 రాఫెల్స్ చేరుతాయని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా (RKS Bhadauria) ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Read Also… Pandals in Kolkata: కోల్ కతాలో వైభవంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు.. ఆకర్షణీయంగా పండల్స్