హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతం నుంచి వెళ్తున్న ఓ జీపు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. కిన్నౌర్ జిల్లాలోని న్యుగల్సరీ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సిమ్లాలోని రాంపూర్ ఆస్పత్రికి తరలించారు. జీపు నుంచి మృతదేహాలను వెలికి తీసి.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరిలించారు. వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Three people were killed & two others injured after a jeep they were travelling in rolled down from a cliff near Nyugalsari area of Kinnaur district, Himachal Pradesh. The injured were rushed to a hospital at Rampur in Shimla: SDM of Bhawanagar in Kinnaur district pic.twitter.com/6mf70JcKV7
— ANI (@ANI) June 18, 2020