Viral Video: వామ్మో.. పట్టపగలు అందరు చూస్తుండగానే 3 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు..

దొంగలు ఆరితేరి పోతున్నారు. దర్జాగా వచ్చి అందిన కాడికి దోచుకుని బయటపడుతున్నారు. గతంలో రాత్రిళ్లు ఎక్కువగా జరిగే చోరీలు.. ఇప్పుడు పట్టపగలు అందరు చూస్తుండగానే జరగడం ఆందోళన కలిగిస్తుంది. గుల్బర్గాలోని ఓ షాపును దుండగులు లూటీ చేశారు. 3కిలోల బంగారం, నగదు దోచుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Viral Video: వామ్మో.. పట్టపగలు అందరు చూస్తుండగానే 3 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు..
Kalaburagi Gold Heist

Updated on: Jul 12, 2025 | 4:01 PM

ఈ మధ్య కాలంలో ఈజీ మనీ కోసం చాలా మంది పక్కదారి పడుతున్నారు. చోరీలకు పాల్పడుతూ జల్సాలు చేసుకుంటున్నారు. కొంతమంది దాన్నే వృత్తిగా చేసుకుంటున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా దొరికిన కాడికి దోచుకుని పోతున్నారు. అంతేకాకుండా కొత్త కొత్త పద్ధతుల్లో చోరీలకు పాల్పడుతూ.. పోలీసులకే సవాల్ విసిరుతున్నారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలవుతున్నారు. తాజాగా కర్ణాటకలో జరిగన దొంగతనం సంచలనంగా మారింది. ఎందుకంటే పట్టపగలే అందరు చూస్తుండగానే ఈ దోపిడి జరిగింది. ముసుగు వేసుకుని వచ్చిన నలుగురు షాప్ ఓనర్ చేతులు, కాళ్లు కట్టేసి భారీగా బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో దోపిడి కేసులు ఎక్కవ అవుతున్నాయి. విజయపుర, బీదర్, దావణగెరె, మంగళూరులలో జరిగిన బ్యాంకు దోపిడీ కేసులు మరవకముందే.. గుల్బర్గాలో గోల్డ్ షాపును దుండగులు లూటీ చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుల్బర్గాలోని నిత్యం రద్దీగా ఉండే సరాఫ్ బజార్‌లో పట్టపగలే ఈ సంఘటన జరిగడం అందరినీ షాక్‌కు గురిచేసింది. కోట్లాది రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ముసుగు ధరించిన నలుగురు దొంగలు తుపాకీ, కత్తులతో మోతీకి చెందిన గోల్డ్ షాపులోకి ప్రవేశించారు. యజమాని చేతులు, కాళ్లు కట్టేసి అందినకాడికి దోచుకెళ్లారు. సుమారు 2 నుంచి 3 కిలోల బంగారు ఆభరణాలు, నగదును దోచుకున్నారని పోలీసులు తెలిపారు. గుల్బర్గా పోలీస్ కమిషనర్ డాక్టర్ శరణప్ప సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పట్టపగలే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది.

పోలీసులు కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగలను పట్టుకోవడానికి ఐదు స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం ఈ టీమ్స్ జల్లెడ పడుతున్నాయి. చోరీకి సంబంధించిన ఘటన సీసీటీవీలో రికార్డు అవ్వగా..ఆ పుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా ఘటనకు సంబంధించి షాప్ ఓనర్ సోదరుడు స్పందంచాడు. ‘‘నా సోదరుడు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దుకాణంలో ఉన్నాడు. సడెన్‌గా ముసుగు ధరించిన నలుగురు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. వారిలో ఇద్దరు అతనిపై తుపాకులు గురిపెట్టగా, మరొకరు కత్తితో బెదిరించారు. ఆ తర్వాత వారు అతని చేతులు, కాళ్లను తాడుతో కట్టి.. లాకర్ తెరిచి, బంగారాన్ని దోచుకుని పారిపోయారు’’ అని షాపు ఓనర్ బ్రదర్ చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..