
భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా వివిధ తరగతుల రైళ్లను నడుపుతున్నాయి. కొన్ని రైళ్లు వాటి వేగానికి, కొన్ని వాటి సౌకర్యానికి, మరికొన్ని వాటి మార్గం ద్వారా ప్రత్యేకతకు ప్రసిద్ధి చెందాయి. వీటిలో పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుండి పంజాబ్‌లోని అమృత్‌సర్ వరకు నడిచే హౌరా-అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ రెండు కారణాల వల్ల దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో మొదటగా చెప్పకోవాల్సింది.. ఇది భారతదేశంలో అత్యంత ఎక్కువగా నడిచే రైలు. రెండవది దీని సమయపాలన ఆదర్శప్రాయమైనది.
హౌరా-అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ రైలు మొత్తం 111 స్టేషన్లలో ఆగుతుంది. ఇది భారతదేశంలోని అన్ని రైళ్ల కంటే ఎక్కువ. 37.5 గంటల్లో 1,910 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. చాలా స్టేషన్లలో ప్రయాణీకులను ఎక్కించుకుని, దింపినప్పటికీ రైలు దాదాపు ఎల్లప్పుడూ సమయానికి తన గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. సుదూర రైళ్లు ఆలస్యంగా వస్తున్నాయనే ఫిర్యాదులు సర్వసాధారణం అయినప్పటికీ, ఈ హౌరా-అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ మాత్రం సమయానికి గమ్యస్థానానికి చేరుకుంటుందని ఈ రైలుకు ఉన్న ఖ్యాతి అందరినీ ఆశ్చర్యపరిచింది.
మార్గం- సౌకర్యాలు:
హౌరా-అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ నడుస్తుంది. ఐదు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్. ఈ రైలు దేశంలోని ప్రధాన నగరాలైన అసన్సోల్, పాట్నా, వారణాసి, లక్నో, బరేలీ, అంబాలా, లూధియానా, జలంధర్‌లలో ఆగుతుంది.
భారతదేశంలోనే అతి పొడవైన రైలు మార్గం అయిన దిబ్రూఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ 4,234 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. కానీ ఇది 59 స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. అయితే, సగం కంటే తక్కువ దూరం ప్రయాణించే హౌరా-అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ మాత్రం రెండింతలు స్టేషన్లలో ఆగుతుంది. ఇది ఈ రైలు ప్రత్యేకతను హైలైట్ చేస్తుంది.
ప్రయాణ వివరాలు:
13005 హౌరా-అమృత్సర్ మెయిల్ రైలు సాయంత్రం 7:15 గంటలకు హౌరా నుండి బయలుదేరి మూడవ రోజు ఉదయం 8:40 గంటలకు అమృత్సర్ చేరుకుంటుంది.
దీని టికెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
– స్లీపర్ క్లాస్ కు రూ.695, ఎసి 3 కి రూ.1,870, ఎసి 2 కి రూ.2,755, ఎసి 1 కి రూ.4,835. సాధారణ కోచ్ టికెట్ ధర కేవలం రూ.400. అదేవిధంగా, 13006 అమృత్సర్-హౌరా మెయిల్ సాయంత్రం 6:25 గంటలకు అమృత్సర్ నుండి బయలుదేరి మూడవ రోజు ఉదయం 7:30 గంటలకు హౌరా చేరుకుంటుంది. దీని టికెట్ ధరలు కూడా ఒకటే: స్లీపర్ క్లాస్ కు రూ.695, ఎసి 3 కి రూ.1,870, ఎసి 2 కి రూ.2,755, ఎసి 1 కి రూ.4,835.
హౌరా-అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ రైలు కేవలం రవాణా సాధనం మాత్రమే కాదు, భారతీయ రైల్వేల క్రమశిక్షణ, సమయపాలన, విశ్వసనీయతకు చిహ్నం. ఇది దేశంలోని వివిధ ప్రాంతాలను కలుపుతుంది. లక్షలాది మంది ప్రయాణికులకు సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ రైలు భారతీయ రైల్వేల వైవిధ్యం, పనితీరును ప్రతిబింబించే సజీవ ఉదాహరణ.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…