స్మార్ట్ ఫోన్లు చేతిలోకొచ్చాక ఎందరో వీటికి అడిక్ట్ అయ్యి ఇబ్బందుల పాలైన కథనాలు వినేవుంటారు. ఐతే ఓ యువకుడు మాత్రం నిత్యం ఆన్‌లైన్ గేమ్స్ ఆడి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకెళ్తే.. బీహార్‌లోని నవాడా జిల్లాకు చెందిన రాజురామ్ అనే యువకుడు డీజేగా పనిచేసేవాడు. దీనితోపాటు చిన్న దుకాణం కూడా నడిపేవాడు. ఈ క్రమంలో రాజురామ్ ఏడాది నుంచి డ్రీమ్ 11 అనే యాప్‌లో క్రికెట్ గేమ్ బెట్టింగ్ ఆడటం మొదలు పెట్టాడు. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బీపీఎల్ టోర్నీలో బ్రిస్బేన్ హిట్, సిడ్నీ థండర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్స్ పై రూ.49తో బెట్టింగ్ పెట్టాడు. అందులో రాజు ఎంచుకున్న టీం అగ్రస్థానంలో నిలవడంతో ఏకంగా రూ. కోటి గెలుచుకున్నాడు. ఉన్నట్టుండి కోటీశ్వరుడైపోయిన రాజును చూసి అతని కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఇక రాజు గెలుచుకున్న కోటీ రూపాయల్లో రూ. 30 లక్షలు పన్నుకు కట్ అవ్వగా.. మిగిలిన రూ.70 లక్షలు అతని సొంతం అయ్యాయి.
గతంలో కూడా చిన్న మొత్తంలో పలుమార్లు బెట్టింగ్‌ల ద్వారా గెల్చుకున్నట్లు రాజు మీడియాకు తెలిపాడు. తాను గేమ్‌లో బెట్టింట్ ఆడుతున్న సమయంలో దాదాపు 35 లక్షల మంది ఒకేసారి ఆ గేమ్‌ను ఆడినట్లు రాజు తెలియజేశాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.