భారతదేశంలో దొంగతనాలు జరుగని ఏకైక గ్రామం.. బ్యాంకులకు కూడా తాళాలు ఉండవు!

|

Mar 27, 2023 | 7:08 AM

ప్రతి రోజూ వార్తా పత్రికల్లో దొంగతనం వార్త లేకుండా వార్తా పత్రిక వస్తుందా? అంటే వందశాతం రాదనే చెబుతాం. టీవీ ఆన్ చేసి వార్తలు చూసి ఎక్కడో చోట దోపిడీకి సంబంధించిన ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అందుకే దోపిడీ దొంగలు, చోరీల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటారు. పోలీసులు కూడా ఆ దిశగా హెచ్చరికలు, సూచనలు, జాగ్రత్తలు చెబుతారు.

భారతదేశంలో దొంగతనాలు జరుగని ఏకైక గ్రామం.. బ్యాంకులకు కూడా తాళాలు ఉండవు!
Shani Shingnapur
Follow us on

ప్రతి రోజూ వార్తా పత్రికల్లో దొంగతనం వార్త లేకుండా వార్తా పత్రిక వస్తుందా? అంటే వందశాతం రాదనే చెబుతాం. టీవీ ఆన్ చేసి వార్తలు చూసి ఎక్కడో చోట దోపిడీకి సంబంధించిన ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అందుకే దోపిడీ దొంగలు, చోరీల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటారు. పోలీసులు కూడా ఆ దిశగా హెచ్చరికలు, సూచనలు, జాగ్రత్తలు చెబుతారు. అయితే, ఎవరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా? పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా దేశంలో చోరీగా మాత్రం అరికట్టడం కష్టంగా మారింది. ఇంతటి పరిస్థితిలోనూ మన దేశంలో ఒక్క దోపిడీ కూడా జరుగని గ్రామం ఉందని మీకు తెలుసా? ఆ గ్రామంలో ఇళ్లకు తలుపు ఉండవని తెలుసా? అంతెందుకు బ్యాంకులకు కూడా తాళాలు ఉండవని మీకు తెలుసా? అని, మీరు విన్నది నిజంగా నిజం. మరి ఆ గ్రామం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ గ్రామం ఏది?

భారతదేశంలోని ఈ ప్రత్యేకమైన గ్రామం మహారాష్ట్రలో ఉంది. ఈ గ్రామం పేరు శని శింగనాపూర్. ఈ గ్రామాన్ని శని దేవుడే కాపాడుతున్నాడని గ్రామస్తులు చెబుతారు. ఈ కారణంగా, ఈ గ్రామంలోని ఏ ఇంటికీ తలుపులు ఉండవు. అంతేకాదు.. ఇక్కడి దుకాణాలు, బ్యాంకులకు కూడా తాళాలుు ఉండవు. శనిశింగనాపూర్ గ్రామస్తులకు శనిదేవునిపై అచంచలమైన భక్తి, విశ్వాసం ఉన్నాయి. శనిదేవుడు తమ కుటుంబాలను, తమ ఇళ్లను ఎల్లప్పుడూ రక్షిస్తాడని ప్రజల విశ్వాసం. ఈ నమ్మకం కారణంగానే నేటికీ గ్రామంలోని ప్రజలు తమ ఇళ్ల తలుపులకు తాళాలు వేయరు, దుకాణాలకు, బ్యాంకులకు కూడా తాళాలు వేయరు. వారు తాళాలు వేయకపోవడమే కాదు.. ఇంత వరకు అక్కడ ఒక్క చోరీ జరిగిన దాఖలాలు కూడా లేవు.

ఇవి కూడా చదవండి

శని దేవుడు..

హిందూ మత గ్రంధాల ప్రకారం.. శని దేవుడు సూర్య భగవానుడి కుమారుడు. న్యాయ దేవుడు అని కూడా పిలుస్తారు. శనిదేవుడు ఈ లోకంలో మనుషులు చేసే చెడు పనులకు శిక్షలు వేస్తాడు. శని శింగనాపూర్ ప్రజలు.. గ్రామస్థులను రక్షించే శని దేవుడిని గ్రామ అధిపతిగా భావిస్తారు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..