Ordnance factory board: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును ప్రత్యేక కార్పోరేట్ సంస్థలుగా విభజించడానికి కేంద్ర మంత్రివర్గ నిర్ణయం

Ordnance factory board: ప్రధాని నరేంద్రమోదీ బుధవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో రక్షణకు సంబంధించిన పెద్ద నిర్ణయం తీసుకున్నారు.

Ordnance factory board: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును ప్రత్యేక కార్పోరేట్ సంస్థలుగా విభజించడానికి కేంద్ర మంత్రివర్గ నిర్ణయం
Ordnance Factory Board
Follow us
KVD Varma

|

Updated on: Jun 17, 2021 | 2:28 PM

Ordnance factory board: ప్రధాని నరేంద్రమోదీ బుధవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో రక్షణకు సంబంధించిన పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (ఓఎఫ్‌బి) ను ప్రత్యేక కార్పొరేట్ సంస్థలుగా విభజించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం, ఈ బోర్డు దేశంలో 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను నడుపుతోంది. ఇది రక్షణ మంత్రిత్వ శాఖకు అనుసంధానంగా ఈ బోర్డు వ్యవహరిస్తుంది. దేశంలో అతిపెద్ద సైనిక పరికరాలు, ఆయుధాలను తయారుచేసే బోర్డు సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమావేశానికి సంబంధించిన ఒక అధికారి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చర్య తీసుకోవటానికి చాలాకాలంగా ఆలోచిస్తోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ చర్యను చారిత్రాత్మకంగా పేర్కొన్నారు. అదేవిధంగా దేశ భద్రతకు ఇది చాలా ముఖ్యం అని అన్నారు.

ఈ నిర్ణయం ప్రకారం ఓఎఫ్‌బి (Ordnance factory board)ని ప్రభుత్వం నిర్వహిస్తున్న 7 వేర్వేరు కార్పొరేట్ కంపెనీలుగా విభజించనున్నట్లు అధికారి తెలిపారు. వీటి కింద 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఇప్పుడు నడుస్తాయి. ఈ నిర్ణయం వల్ల ఒక్క ఉద్యోగి కూడా ప్రభావితం కారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయంతో, ఓఎఫ్‌బి ఉనికిలో ఉండదు. 7 కార్పొరేట్ సంస్థలు మందుగుండు సామగ్రి, వాహనాలు, ఆయుధాలు, పరికరాలు, ఎలక్ట్రానిక్ గేర్, సైనిక అవసరాలు మరియు పారాచూట్లను తయారు చేస్తాయి.

ప్రస్తుతం, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ట్యాంకులు, సాయుధ వాహనాలు, ల్యాండ్‌మైన్ రక్షణ వాహనాలు, బాంబులు, రాకెట్లు, ఫిరంగి తుపాకులు, విమాన నిరోధక తుపాకులు, పారాచూట్లు, చిన్న ఆయుధాలు, సైనికులకు దుస్తులు, తోలు పరికరాలను తయారు చేస్తున్నాయి. కొత్త నిర్ణయంతో, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు మరింత ఉత్పాదకత కలిగిన లాభదాయక సంస్థలుగా రూపాంతరం చెందుతాయి. ఇది స్వావలంబన భారతదేశం వైపు పెద్ద అడుగు అని ఒక అధికారి తెలిపారు. దీనివలన రక్షణ ఉత్పత్తుల నాణ్యత, పనితీరు పెరుగుతుంది. ఇది కూడా ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. అదే సమయంలో జవాబుదారీతనం కూడా దీనికి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సంవత్సరం చివరి నాటికి ఓఎఫ్‌బి కొత్త సెటప్ సిద్ధంగా ఉంటుంది. పాత నిర్మాణంలో ఉన్న లోపాలు కొత్త సెటప్‌లో తొలగించబడతాయి. కొత్త 7 కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా, వాటిని కూడా మరింత పోటీగా మారుస్తారు. గత రెండు దశాబ్దాలుగా, అనేక ఉన్నత స్థాయి కమిటీలు కూడా ఓఎఫ్‌బి ల పనితీరును సంస్కరించాలని నొక్కిచెప్పాయి. దీనితో పాటు, దాని కింద పనిచేసే కర్మాగారాలు కూడా స్వయం సమృద్ధిగా ఉండాలని ఆ కమిటీలు సిఫారసు చేస్తూ వస్తున్నాయి.

Also Read: Twitter Story: ట్విట్టర్ మొండి పట్టుదలకు కారణం ఏమిటి? ఎందుకు భారత ప్రభుత్వం మాట లెక్కచేయడం లేదు?

CBSE: సీబీఎస్ఈ 12వ తరగతిలో మార్కుల విధానం, స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ రద్దు అంశంపై సుప్రీంలో కొనసాగుతున్న వాదనలు