Dussehra: వేడుకల మాటున అశ్లీలత.. మద్రాస్ హైకోర్టు సీరియస్.. నిషేధం విధిస్తూ ఆర్డర్స్..

|

Sep 15, 2022 | 10:43 AM

దసరా (Dussehra) ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా, అంగరంగ వైభవంగా జరుగుతాయి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అందరూ భక్తి పారవశ్యంలో మునిగి తేలతారు. వివిధ రూపాల్లో దేవిని ఆరాధిస్తారు. విజయదశమి...

Dussehra: వేడుకల మాటున అశ్లీలత.. మద్రాస్ హైకోర్టు సీరియస్.. నిషేధం విధిస్తూ ఆర్డర్స్..
Justice
Follow us on

దసరా (Dussehra) ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా, అంగరంగ వైభవంగా జరుగుతాయి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అందరూ భక్తి పారవశ్యంలో మునిగి తేలతారు. వివిధ రూపాల్లో దేవిని ఆరాధిస్తారు. విజయదశమి పర్వదినాన చేసే సందడి, హంగామా అంతా ఇంతా కాదు. తమిళనాడులో కూడా దసరా వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అశ్లీల నృత్యాలు, సినిమా పాటల రికార్డింగ్ డ్యాన్సులు కూడా ఉంటాయి. కాగా.. వీటిపై మద్రాసు హైకోర్టు (Madras High Court) మదురై బెంచ్ నిషేధం విధించింది. భక్తి గీతాలకే ప్రాధాన్యత ఇవ్వాలని న్యాయమూర్తులు మహాదేవన్, సత్యనారాయణ ప్రసాద్‌ లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ముఖ్యంగా తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణం విడయదశమి ఉత్సవాలకు ఫేమస్. ఇక్కడి ముత్తాలమ్మన్‌ కోయిల్ లో తొమ్మిదిరోజులు పాటు ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతాయి. సినిమా పాటలకు చేసే డ్యాన్స్ ల్లో శృతి మించిపోతోంది. ఏటా అశ్లీలత పెరిగిపోతోంది. వీటిపై రాంకుమార్‌ ఆదిత్యన్‌ అనే సామాజిక కార్యకర్త మదురై బెంచ్ లో పిటిషన్ వేశారు. దసరా ఉత్సవాల పేరిట జరుగుతున్న అశ్లీల నృత్యాలను నిషేధించాలని వ్యాజ్యంలో కోరారు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు మహాదేవన్, సత్యనారాయణ ప్రసాద్‌ లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భక్తితో జరుపుకునే పండుగలో భక్తులు వ్రతాలు, నోములకు అధిక ప్రాధాన్యత ఇస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ సందర్భాల్లో అశ్లీల కార్యక్రమాలు పెట్రేగిపోతున్నాయని, వీటి వల్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాదించారు. వాదనల అనంతరం న్యాయమూర్తులు దసరా ఉత్సవాల్లోనే కాకుండా, ఏ ఆలయ వేడుకల్లోనూ ఇకపై అశ్లీల నృత్యాలు, సినిమా పాటలకు అవకాశం ఇవ్వకూడదని తీర్పు ఇచ్చారు. కులశేఖర పట్టణంలో జరిగే వేడుకల్లో ఇలాంటివి జరకుండా చూడాలని తూత్తుకుడి జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ లకు ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి