Kerala High Court: శబరిమల ఏర్పాట్లపై సర్వత్రా విమర్శలు.. ప్రభుత్వానికి కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు..

|

Dec 16, 2023 | 2:12 PM

ఓవైపు శరణు ఘోష మరోవైపు భక్తుల అరిగోస.. గతంలో ఎన్నడూలేని విధంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతంగా క్యూలైన్‌‌లో భక్తులు నిరీక్షిస్తున్నారు. రోజుకు 80 వేల నుంచి లక్ష వరకూ భక్తులు వస్తుండటంతో దర్శనానికి సమయం 18 నుంచి 24 గంటల పడుతోంది. భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది.

Kerala High Court: శబరిమల ఏర్పాట్లపై సర్వత్రా విమర్శలు.. ప్రభుత్వానికి కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు..
Kerala High Court
Follow us on

ఓవైపు శరణు ఘోష మరోవైపు భక్తుల అరిగోస.. గతంలో ఎన్నడూలేని విధంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతంగా క్యూలైన్‌‌లో భక్తులు నిరీక్షిస్తున్నారు. రోజుకు 80 వేల నుంచి లక్ష వరకూ భక్తులు వస్తుండటంతో దర్శనానికి సమయం 18 నుంచి 24 గంటల పడుతోంది. భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. కొండ కింద పంబ నుంచి సన్నిధానం వరకు క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఘాట్ రోడ్డులో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భక్తులకు తలెత్తున్న ఇబ్బందులపై కేరళ హైకోర్టు దేవస్థానం బెంచ్ సుమోటో కేసును స్వీకరించింది. మండలం, మకరజ్యోతి కాలంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే స్పందించిన సర్కార్‌ ఉన్నపళంగా బందోబస్తు కోసం జిల్లాల నుంచి పోలీస్‌ బలగాలను తరలిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో ఎక్కడికక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు చేపడుతున్నారు. రద్దీని క్రమబద్దీకరించేలా చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు భక్తులు ఇబ్బందులు పడుతుండడంతో కేరళ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పినరయి సర్కార్ తీరుపై విమర్శలు చేస్తున్నాయి. సరైన ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..