ప్రశాంత వాతావరణంలో అలరారుతూ.. భూలోక స్వర్గంగా పేరు గాంచిన కశ్మీర్ (Jammu – Kashmir) లో ఉగ్రవాదులు అలజడి ఎక్కువే. పొరుగునే ఉన్న పాకిస్తాన్ తో బార్డర్ సంబంధాల దృష్ట్యా అక్కడి పరిస్థితులు నిత్యం ఉద్రిక్తంగా ఉంటాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులతో సంబంధాలున్న ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంది. నలుగురిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తూ.. తప్పుడు ప్రచారం చేస్తున్న వారితో సంబంధాలున్నాయని అధికారులు గుర్తించారు. దీంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ప్రభుత్వపరంగా చర్యలు తీసుకునే అధికారం ఉంది. దీనిపై ఎలాంటి విచారణ చేపట్టకుండా వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు జరుపుతున్నారన్న ఫిర్యాదుతో వాణిజ్య, పరిశ్రమల శాఖలో పని చేస్తున్న సయ్యద్ అబ్దుల్ ముయీద్, జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ అసాబ్ ఉల్ అర్జామంద్ ఖాన్ (ఫరూక్ అమ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటె భార్య) , కశ్మీర్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా పని చేస్తున్న డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్, కశ్మీర్ యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ప్రొఫసర్‌గా పని చేస్తున్న మజీద్ హుస్సేన్ ఖాద్రిలను ఉద్యోగాల నుంచి తొలగించారు.
అయితే.. సోంపెరాలోని జేకేఈడీఐ కాంప్లెక్స్‌లో జరిగిన పేలుళ్లతో అబ్దుల్ ముయీద్‌కు సంబంధం ఉంది. ఈ క్రమంలో అర్జామంద్‌ఖాన్‌కు పాస్‌పోర్టు కోసం తప్పుడు సమాచారం అందించాడు. డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్ యూనివర్సిటీల్లో విద్యార్థుల్ని భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా పాఠాలు బోధిస్తున్నారని, మరో ప్రొఫెసర్ మజీద్ హుస్సేన్‌కు నిషిద్ధ లష్కరేతోయిబా సహా పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని గుర్తించారు. సయ్యద్ సలాహుద్దీన్ ఇద్దరు కుమారులు గతంలోనే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మూడో కుమారుడిపైన కూడా వేటు పడింది.