Inspiring Story Preeti Hooda IAS: ఏ తల్లిదండ్రులైనా సరే తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని.. వారు బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని.. సమాజంలో తమకు మంచి పేరు తీసుకునిరావాలని కోరుకుంటారు. పిల్లల భవిష్యత్ పై ఎన్నో ఆశలను పెట్టుకుని తమకు ఎన్ని కష్టనష్టాలను ఎదురైనా లెక్కచేయకుండా కష్టపడతారు. అలా తమకోసం తల్లిదండ్రులను పడుతున్న కష్టాలను చూసి.. వారి కలలు తీర్చడానికి కోరికలు తీర్చడానికి పిల్లలు రేయింబవళ్లు కష్టపడతారు. అలా తండ్రి కష్టాన్ని చూసి.. ఎంతో కష్టపడి చదుకుని నేడు ఐఏఎస్ ఆఫీసర్ గా ఎంపికైన ఓ యువతి గురించి తెలుసుకుందాం..
సివిల్స్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పరీక్ష. మదర్ ఆఫ్ ఆల్ సర్వీసెన్ అంటూ పిలుచుకునే ఈ సివిల్స్ రాసేది లక్షల మంది.. కానీ ఉత్తీర్ణత అయ్యేవారు వందల్లోనే.. అంతకష్టమైన పరీక్షకు ఆర్ధిక పరిస్థితి అడ్డుకాదని.. నిరూపిస్తూ.. ఓ బస్సు డ్రైవర్ కూతురు ప్రీతి హుడా దేశ అత్యున్నత సర్వీస్ సివిల్స్ లో ర్యాంక్ సాధించింది.
ప్రీతి హుడా స్వస్థలం హర్యానాలోని బహదూర్‌గఢ్. తండ్రి ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అయితే ప్రీతి తనకు ఐఏఎస్ అధికారిని కావాలని ఉంది అని చెప్పారు తండ్రికి అంతేకాదు యుపిఎస్‌సి పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టారు. అయితే అప్పుడు కూడా ప్రీతి ఆడుతూ పాడుతూ ప్రణాళికతో యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధమయ్యారు ప్రీతి. సివిల్స్ లో హిందీ మీడియాన్ని ఎంచుకుంది. అంతే కాదు హిందీ సబ్జెక్టును ఆఫ్షనల్ గా ఎంచుకుంది. ప్రీతి హుడా తన మొదటి ప్రయత్నంలో విఫలమయ్యారు. అంతటితో నిరుత్సాహ పడకుండా రెండో సారి ప్రయత్నించారు. 2017లో ప్రీతి సివిల్స్ క్రాక్ చేశారు.. 288వ ర్యాంక్ సాధించి.. ఐఏఎస్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. కూతురు ఐఏఎస్ అధికారిని అయినా తండ్రి ఇప్పటికీ బస్సు డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నారు. తన కూతురు సాధించిన విజయానికి సంతోషం వ్యక్తం చేస్తుంటారు.
ప్రీతి హుడా తన చిన్నప్పటి నుండి చదువులో చురుకుగా ఉండేవారు. ప్రీతి హుడా 10 వ తరగతిలో 77% , 12 వ తరగతిలో 87% తో ఉత్తీర్ణత అయ్యారు. అయితే ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ప్రీతిని చదువు ఆపేసి, పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. అయితే ప్రీతికి చదువుమీద ఉన్న ఆసక్తిని చూసి తల్లిదండ్రులు డిగ్రీలో జాయిన్ చేశారు. ఢిల్లీలోని లక్ష్మీ బాయి కళాశాలలో హిందీలో డిగ్రీ పూర్తి చేసింది. 76 శాతం తో డిగ్రీ పట్టాపుచ్చుకున్నారు. అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో హిందీలో PhD పూర్తి చేశారు. యూపీఎస్సీ పరీక్ష క్లియర్ చేయాలంటే కావాల్సింది సన్నద్ధత, సంకల్పం, పట్టుదల అని నిరూపించారు ప్రీతి. ఆర్థిక పరిస్థితి అడ్డంకిగా మారినా వాటిని అధిగమించి విజయం సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు ప్రీతి హుడా..
Also Read: Bathukamma in UK: అక్టోబర్ 10న లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలు.. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
R.1 COVID Variant: మానవాళిపై పగబట్టిన కోవిడ్.. కొత్తవేరియంట్ గుర్తింపు.. 35 దేశాల్లో 10వేల మంది బాధితులు..