RTC Bus: దొంగతనాలందు ఈ దొంగతనం వేరయా.. బస్టాండ్ లో పార్కింగ్ చేసిన ఆర్టీసీ బస్సునే లేపేశారు..

|

Feb 22, 2023 | 6:45 AM

దొంగలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. రోజుకో విధంగా వెరైటీగా దొంగతనాలు చేస్తున్నారు. బైక్ లు, కార్ల వరకే పరిమితమైన దొంగతనాలు.. ఇప్పుడు ఆర్టీసీ బస్సులనూ తాకాయి. తాజాగా...

RTC Bus: దొంగతనాలందు ఈ దొంగతనం వేరయా.. బస్టాండ్ లో పార్కింగ్ చేసిన ఆర్టీసీ బస్సునే లేపేశారు..
Rtc Bus Theft
Follow us on

దొంగలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. రోజుకో విధంగా వెరైటీగా దొంగతనాలు చేస్తున్నారు. బైక్ లు, కార్ల వరకే పరిమితమైన దొంగతనాలు.. ఇప్పుడు ఆర్టీసీ బస్సులనూ తాకాయి. తాజాగా కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ ఆర్టీసీ బస్సును దొంగలు చోరీ చేశారు. పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేకపోవడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కర్నాటకలోని కలబురగి జిల్లాలోని చించోలి బస్టాండ్​లో పార్కింగ్ చేసి ఉన్న బస్​ను కొందరు KA-38 F-971 నంబర్ గల ఈ బస్సు.. బీదర్​ రెండో డిపోనకు చెందినదిగా గుర్తించారు.

ఈ బస్సు చించోలి – బీదర్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. చోరీకి గురైన బస్సు.. సోమవారం రాత్రి బీదర్​ నుంచి ప్రయాణికులతో చించోలికి వచ్చింది. ఆ తర్వాత 9.15 గంటలకు బస్ స్టాండ్​లో పార్క చేశారు. ఉదయం బస్సును బీదర్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. బస్సు కనిపించలేదు. దీంతో కంగుతిన్న డ్రైవర్​.. ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించాడు. ఆర్టీసీ అధికారులు.. చించోలి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి చోరీకి గురైన బస్సును, నిందితుడిని వెతికారు. కర్ణాటక ఆర్టీసీ అధికారులు కూడా రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపులు జరిపారు. అనంతరం తెలంగాణలో బస్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. బస్సును దొంగిలించిన వారు మాత్రం దొరకలేదు. వారి ఆచూకీ తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.