PM Garib Kalyan Anna Yojana: రేషన్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్.. ఉచిత పంపిణీకి కేంద్రం మంగళం పాడనుందా?

|

Jun 25, 2022 | 4:54 PM

ఉచిత రేషన్‌ పంపిణీ పథకంతో పాటు ఎరువుల సబ్సిడీ పెంపు, వంటగ్యాస్‌పై సబ్సిడీ, పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు, ఎడిబుల్‌ ఆయిల్స్‌పై కస్టమ్స్‌ సుంకం తగ్గింపు వంటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆర్థిక శాక తర్జనభర్జనలు పడుతోంది.

PM Garib Kalyan Anna Yojana: రేషన్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్.. ఉచిత పంపిణీకి కేంద్రం మంగళం పాడనుందా?
Pm Garib Kalyan Anna Yojana
Follow us on

రేషన్ కార్డుదారులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇస్తోన్న ఉచిత రేషన్‌కు ఇకపై మంగళం పాడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆర్థిక, ఆహార భద్రత సమస్యల కారణంగా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను పొడిగించవద్దని ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఉచిత రేషన్ పంపిణీ పథకం. ఇది కరోనావైరస్ మహమ్మారి సమయంలో మొదటి వేవ్ నేపథ్యంలో మార్చి 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద 80 కోట్ల మంది పౌరులకు ప్రతి నెలా ఐదు కిలోల ఉచిత రేషన్‌ను అందిస్తున్నారు.

దేశవ్యాప్తంగా కరోనావైరస్ సమయంలో లాక్‌డౌన్ కారణంగా ఆదాయ వనరులు లేక ఇబ్బందులు పడుతోన్న పౌరులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ పథకం అనేక సందర్భాల్లో పొడిగించుకుంటూ వచ్చారు. తాజాగా సెప్టెంబర్ వరకు కేంద్రం ఈ పథకాన్ని పొడిగించింది.

కాగా, ఈ పథకాన్ని ఇలా పొడిగించడం వల్ల మున్ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. “భారీ సబ్సిడీ పెంపు/పన్ను తగ్గింపులు చేయకపోవడం చాలా ముఖ్యం” అంటూ కేంద్ర ప్రభుత్వానాకి ఓ లేక రాసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో 2022-’23 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక లోటు – ఆదాయాలు, వ్యయాల మధ్య వ్యత్యాసం – దేశ జీడీపీలో 6.4%కి కోట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరానికి ఆహార సబ్సిడీల కోసం ప్రభుత్వం రూ. 2.07 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. సెప్టెంబరు వరకు ఉచిత రేషన్ పంపిణీ పథకం సబ్సిడీ బిల్లు దాదాపు రూ.2.87 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ప్రభుత్వం ఈ పథకాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తే, బిల్లు దాదాపు రూ. 3.7 లక్షల కోట్లకు చేరుకోవచ్చని పేర్కొంది.

ఉచిత రేషన్‌ పంపిణీ పథకంతో పాటు ఎరువుల సబ్సిడీ పెంపు, వంటగ్యాస్‌పై సబ్సిడీ, పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు, ఎడిబుల్‌ ఆయిల్స్‌పై కస్టమ్స్‌ సుంకం తగ్గింపు వంటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆర్థిక శాక తర్జనభర్జనలు పడుతోంది. ఇది తీవ్రమైన ఆర్థిక పరిస్థితికి దారి తీయోచ్చని హెచ్చరించింది.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, ఎరువులపై సబ్సిడీ 2022-’23 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ. 1.05 లక్షల కోట్ల నుంచి రూ. 2.15 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అలాగే ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని సీతారామన్ తెలిపారు. వంటగ్యాస్ సబ్సిడీ వల్ల రూ.6,100 కోట్ల నష్టం వాటిల్లుతుంది. దీంతో ఆర్థిక శాక కేంద్రానికి ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.