Asaduddin Owaisi: పాక్ మంత్రి రషీద్ ఓ పిచ్చివాడు.. మా పెద్దలు పాకిస్థాన్ వెళ్లనందుకు మేము అదృష్టవంతులం అంటున్న ఒవైసీ

|

Oct 28, 2021 | 8:53 AM

Asaduddin Owaisi: ప్రపంచకప్ టీ20 మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయం 'ఇస్లాం విజయం' అని పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్ సంచలన కామెంట్స్ చేశారు. రషీద్ వ్యాఖ్యలపై..

Asaduddin Owaisi: పాక్ మంత్రి రషీద్ ఓ పిచ్చివాడు.. మా పెద్దలు పాకిస్థాన్ వెళ్లనందుకు మేము అదృష్టవంతులం అంటున్న ఒవైసీ
Asaduddin Owaisi
Follow us on

Asaduddin Owaisi: ప్రపంచకప్ టీ20 మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయం ‘ఇస్లాం విజయం’ అని పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్ సంచలన కామెంట్స్ చేశారు. రషీద్ వ్యాఖ్యలపై  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రషీద్ ఓ “పిచ్చివాడు” అని  అన్నారు. ముజఫర్‌నగర్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఒవైసీ మాట్లాడుతూ.. ‘క్రికెట్ మ్యాచ్‌లకు ఇస్లాం మతానికి సంబంధం ఏమిటి? .. మా పెద్దలు పాకిస్తాన్ వెళ్ళనందుకు అల్లాకు కృతజ్ఞతలు.. లేకపోతే మనం ఈ పిచ్చివాళ్లను చూడవలసి వచ్చేది అని అన్నారు.

భారత్ పై పాకిస్థాన్ విజయం తర్వాత:

టి20 ప్రపంచ కప్ లో భారత దేశంపై పాకిస్థాన్ గెలిచిన అనంతరం ఇమ్రాన్ భారత ను ఎగతాళి చేశాడు. ఇక పాకిస్థాన్ మంత్రి రషీద్ ఓ అడుగు ముందుకేసి.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. “భారత ముస్లింలతో సహా ప్రపంచంలోని ముస్లింలందరి మనోభావాలు పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో ముడిపడి ఉన్నాయని అన్నాడు.
ఇక పాకిస్థాన్ విజయం పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పుడు భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడంపై మాట్లాడేందుకు సరైన సమయం కాదని చెప్పాడు. కాశ్మీర్ సమస్య పరిష్కారం గురించి కూడా ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు.

భారత్‌తో కలిసి పాకిస్తాన్ క్రికెట్ విషయంలో కలిగి నడవాలని కోరుకుంటుందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.  సౌదీ అరేబియాలో తన మూడు రోజుల అధికారిక పర్యటన సందర్భంగా ఆయన ఈ ప్రకటనలు చేశారు. రియాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఖాన్ మాట్లాడుతూ, T20 ప్రపంచ కప్‌లో భారత్‌పై తన దేశం సాధించిన విజయం “చారిత్రకమైనది” అని పేర్కొన్నాడు. భారత్‌, పాకిస్థాన్‌లు మంచి ఇరుగు పొరుగు దేశాలుగా ముందుకు వెళ్ళవచ్చనని.. ఢిల్లీతో ఇస్లామాబాద్‌ స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటోందని అన్నారు.

Also Read:  కీళ్లనొప్పులు, మెడ నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారా.. అయితే గుగ్గులు ఉపయోగించి చూడండి ..