సోషల్ మీడియాలో పాకిస్తాన్ వ్యక్తితో ప్రేమ-పెళ్లి.. అతని కోసం ఏం చేసిందో తెలిస్తే షాక్..!

|

Jul 25, 2024 | 11:12 AM

ప్రేమ ఎళ్లలు దాటుతోంది. మహారాష్ట్రలోని థానే ప్రాంతానికి చెందిన మహిళ ప్రియుడి కోసం పాకిస్తాన్‌ వెళ్లోచ్చింది. అయితే తాను వెళ్లి రావడంపై పెద్ద దుమారం రేగుతోంది. నకిలీ పాస్‌పోర్టుపై పాక్ వెళ్లి రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. థానేకు చెందిన నగ్మా.. ప్రియుడి కోసం నకిలీ పాస్‌పోర్టు, నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించింది.

సోషల్ మీడియాలో పాకిస్తాన్ వ్యక్తితో ప్రేమ-పెళ్లి.. అతని కోసం ఏం చేసిందో తెలిస్తే షాక్..!
Thane Woman
Follow us on

ప్రేమ ఎళ్లలు దాటుతోంది. మహారాష్ట్రలోని థానే ప్రాంతానికి చెందిన మహిళ ప్రియుడి కోసం పాకిస్తాన్‌ వెళ్లోచ్చింది. అయితే తాను వెళ్లి రావడంపై పెద్ద దుమారం రేగుతోంది. నకిలీ పాస్‌పోర్టుపై పాక్ వెళ్లి రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. థానేకు చెందిన నగ్మా.. ప్రియుడి కోసం నకిలీ పాస్‌పోర్టు, నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించింది. నకిలీ వీసాను ఉపయోగించి పాకిస్తాన్‌కు వెళ్లొచ్చింది. ఈ విషయం గమనించిన థానే పోలీసులు ఆమెను పిలిపించి విచారణ చేస్తున్నారు.

థానేకు చెందిన నగ్మా.. ఫేస్‌బుక్ ద్వారా పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌కు చెందిన బాబర్ బషీర్ అహ్మద్‌తో పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారిద్దరి మధ్య ఇష్టం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే నగ్మా పాకిస్తాన్‌ వెళ్లేందుకు ట్రై చేసింది. పాస్‌పోర్టు తిరస్కరణకు గురికావడంతో .. ఫిబ్రవరి 2024లో నగ్మా.. బాబర్‌ను ఆన్‌లైన్‌లో వివాహం చేసుకుంది. తర్వాత బాబర్‌ కోసం పాకిస్తాన్ వెళ్లేందుకు వీసీలో నగ్మా నూర్ మక్సూద్ అలీ సనమ్ ఖాన్ రూఖ్‌గా పేరు మార్చుకుంది. అలాగే ఆధార్ సహా పలు పత్రాల్లో పేరు మార్చుకుని పాస్ పోర్టు సంపాదించింది.

హ్యాపీగా పాక్ వెళ్లిపోయిది. తిరిగి జూలై 17న థానేకు చేరుకుంది. లోకమాన్య నగర్‌లోని ఒక కేంద్రం నుంచి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వీసా సంపాదించినట్లుగా పోలీసులు గుర్తించారు. నకిలీ పత్రాలను ఉపయోగించి పాస్‌పోర్ట్, వీసా పొందడంలో నగ్మాకు సహాయం చేసిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో నగ్మా పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నానని, అతనిని పాకిస్తాన్‌లో పెళ్లి చేసుకున్నానని చెప్తోంది. ఆమె మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగ్మా స్వస్థలం ఉత్తరప్రదేశ్ కాగా.. ఆమె ఉద్యోగరీత్యా థానేలో స్థిరపడింది. ప్రస్తుతం ఆమెను అనేక కోణాల్లో విచారిస్తున్నారు. అయితే పోలీసుల ఆరోపణలను నగ్మా తల్లి ఖండించింది. 2015లో తన భర్త నుంచి విడిపోయాక నగ్మా పేరు మార్చుకుందని తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…