Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని ఏదో ఒక ప్రాంతంలో ప్రతి రోజు కాల్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అక్కడ ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక పోలీసులు బలగాలు గాలింపు చర్యలు చేపడుతుంటారు. ప్రతి రోజు ఉగ్రవాదులను మట్టుబెడుతూనే ఉన్నాయి భద్రతా బలగాలు. జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్‌లోని వాటర్‌హోల్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ రాథర్‌తో సహా ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఘటనా స్థలం నుంచి మృతదేహాలను తరలిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను హతమార్చడం పెద్ద విజయంగా పోలీసులు అభివర్ణించారు. హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒక ఉగ్రవాది మే నెలలో కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను హతమార్చిన ఘనటలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
J&K | Encounter underway at the Waterhail area of Budgam. Three terrorists of terror outfit LeT(TRF) are trapped, including terrorist Lateef Rather who was involved in several civilian killings including Rahul Bhat and Amreen Bhat.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/Mapmrcqf3j
— ANI (@ANI) August 10, 2022
ఈరోజు బుద్గామ్‌లో హతమైన ముగ్గురు లష్కర్ ఉగ్రవాదుల్లో లతీఫ్ రాథర్ అలియాస్ ఒసామా కూడా ఉన్నాడని కాశ్మీర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం జిల్లాలోని ఖాన్‌సాహిబ్ ప్రాంతంలోని వాటర్‌హోల్ వద్ద ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు.. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు ప్రతినిధి తెలిపారు. మే 12న జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలోని చదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయం లోపల రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. శరణార్థుల కోసం ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద క్లర్క్ ఉద్యోగం పొందాడు రాహుల్ భట్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి