TERROR ALERT: దేశవ్యాప్తంగా మరోసారి హై అలర్ట్‌.. ఆరుగురు టెర్రరిస్టుల అరెస్టులతో అప్రమత్తం

దేశంలో ఎక్కడెక్కడ ఉగ్రకుట్ర జరిగింది. అరెస్టయిన ఆ ఆరుగురు ఎక్కడ శిక్ష తీసుకున్నారు. వాళ్ల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరు.. ఇవన్నీ తేల్చేందుకు ఢిల్లీ పోలీసులు రెడీ అయ్యారు.

TERROR ALERT: దేశవ్యాప్తంగా మరోసారి హై అలర్ట్‌.. ఆరుగురు టెర్రరిస్టుల అరెస్టులతో అప్రమత్తం
Terror Alert

Updated on: Sep 15, 2021 | 2:14 PM

దేశంలో ఎక్కడెక్కడ ఉగ్రకుట్ర జరిగింది. అరెస్టయిన ఆ ఆరుగురు ఎక్కడ శిక్ష తీసుకున్నారు. వాళ్ల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరు.. ఇవన్నీ తేల్చేందుకు ఢిల్లీ పోలీసులు రెడీ అయ్యారు. అరెస్ట్ చేసిన ఆరుగురు టెర్రిస్ట్‌లో నలుగుర్ని కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల రిక్వెస్ట్ మేరకు.. వాళ్లను 14రోజుల కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం. జాన్‌ మహ్మద్‌, ఒసామా, మూల్‌చంద్‌, మహ్మద్‌ అబూ బకర్‌లను ఇప్పటికే కస్టడీకి తీసుకున్నపోలీసులు.. మిగిలిన మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా కాసేపట్లో కోర్టు ముందు ఉంచుతారు.

కోర్టు ముందుకు వెళ్లాల్సిన జేషన్ ఖమర్, ఆమిర్ జావేద్కు పాక్‌లోని కరాచీలో ఉగ్రశిక్షణ తీసుకున్నారు. గతంలో ముంబై దాడులకు పాల్పడ్డ అజ్మల్‌ కసబ్‌ లాంటి వ్యక్తులకు శిక్షణ ఇచ్చిన చోటే వీళ్లు ట్రైనింగ్ తీసుకుని మానవబాంబులుగా మారినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: నెల్లూరులో దారుణం.. యువతిని వ్యభిచారం చేయాలంటూ దారుణంగా హింసించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

Viral Video:నీటి గుంటలో ఎంచక్కా ఈత కొట్టేస్తున్న బుజ్జి కుక్క పిల్లలు.. మీ కళ్లను మీరే నమ్మలేరు..