AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం.. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా కొత్త ముసాయిదా చట్టం.. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు..!

లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా మరో రాష్ట్రం కఠినచట్టం అమలు చేయబోతుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకురాగా, తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని తయారు చేసింది.

మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం.. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా కొత్త ముసాయిదా చట్టం.. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు..!
Balaraju Goud
|

Updated on: Nov 26, 2020 | 1:03 PM

Share

లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా మరో రాష్ట్రం కఠినచట్టం అమలు చేయబోతుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకురాగా, తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని తయారు చేసింది. లవ్ జిహాద్ కేసుల్లో నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించేలా ఈ రాష్ట్రం కొత్త ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ముస్లిమ్ యువకులు హిందూ యువతులకు ప్రేమించి వివాహం చేసుకుంటే లవ్ జిహాద్ కింద కేసు నమోదు చేసి వారికి పదేళ్ల జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకువచ్చినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.

బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ సర్కారు లవ్ జిహాద్ ను అనుమతించమని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ స్పష్టం చేశారు. బలవంతంగా మోసం చేసి మతాంతర పెళ్లి చేసుకొని ప్రలోభాల ద్వారా మతమార్పిడిని నిషేధించే ఆర్డినెన్సును యూపీ సర్కారు ఆమోదించిన ఒకరోజు తర్వాత మధ్యప్రదేశ్ సర్కారు కొత్త చట్టాన్ని రూపొందించింది. ఈ కొత్త ముసాయిదా చట్టం ప్రకారం మతాంతర వివాహాలను నియంత్రించవచ్చని సీఎం శివరాజ్ సింగ్ అన్నారు.

లవ్ జిహాద్ కేసులో నిందితులను నాన్ బెయిల్ కింద అరెస్టు చేయనున్నట్లు చట్టంలో పేర్కొన్నారు. నిందితులు అరెస్ట్ అయ్యాక 45 రోజుల వరకు బెయిల్ పొందేందుకు వీలుండదు. ఈ కేసుల్లో గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారని మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా చెప్పారు. దీనికోసం రూపొందించిన మధ్యప్రదేవ్ ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, డిసెంబరు 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీలో బిల్లును తీసుకువస్తామని హోంశాఖ మంత్రి వెల్లడించారు. అలాగే, మతాంతర వివాహాలు చేసే వివిధ మతాల గురువులకు ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించడంతోపాటు మత మార్పిడులను ప్రోత్సహించే సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత