Road Accident: మైసూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కారు ఢీకొని 10 మంది దుర్మరణం.. పలువురికి తీవ్ర గాయాలు

కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మైసూరులో బస్సు-కారు ఢీ కొన్న ఘటనలో 10 మంది మృతి చెందారు. అలాగే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మైసూరులోని కొల్లేగల్ - టి నరసిపురా రోడ్డులో కురుబురు గ్రామం పింజర పోల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Road Accident: మైసూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కారు ఢీకొని 10 మంది దుర్మరణం.. పలువురికి తీవ్ర గాయాలు
Road Accident

Updated on: May 29, 2023 | 5:10 PM

కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మైసూరులో బస్సు-కారు ఢీ కొన్న ఘటనలో 10 మంది మృతి చెందారు. అలాగే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మైసూరులోని కొల్లేగల్ – టి నరసిపురా రోడ్డులో కురుబురు గ్రామం పింజర పోల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు, ఇన్నోవా కారు ఢీకొన్ని ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఇరుక్కున్న వారిని స్థానికులు రక్షించారు. ప్రమాదంలో మొత్తం 10 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురిని బళ్లారికి చెందిన జనార్దన్ (45), పునీత్ (4), శశికుమార్ (24)గా గుర్తించి చామరాజనగర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని తదుపరి చికిత్స కోసం మైసూర్‌లోని ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. కాగా మృతుల బంధువుల రోదనలతో ప్రమాద స్థల పరిసరాలు హృదయ విదారకంగా మారాయి.

సమాచారం అందుకున్న టి.నరసీపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు  ప్రారంభించారు. అలాగే ప్రాథమిక ఆధారాలు సేకరించి ఘటనపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం  క్లిక్ చేయండి..

Follow Us