Liter Petrol Only One Rupee : ఈ రోజు పెట్రోల్ ముంబైలో రూ.104.90. ఢిల్లీలో లీటరుకు 98.81 రూపాయలు నడుస్తోంది. చమురు కంపెనీలు గత రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలను 33 సార్లు పెంచాయి. ఈ రోజు (జూన్ 29, మంగళవారం) పెట్రోల్ ధరను 35 పైసలు, డీజిల్ ధరను 28 పైసలు పెంచారు. అయితే లీటరు పెట్రోల్‌ని మీరు ఒక రూపాయికే పొందవచ్చని చెబితే ఏం చేస్తారు.. అవును ఇది నిజం అయితే ఒక షరతు మీరు వందేమాతరం చెప్పాలి అప్పుడే లీటర్ పెట్రోల్ ఒక్క రూపాయికి లభిస్తుంది.
1 రూపాయికి 1 లీటర్ పెట్రోల్ ఎక్కడ తెలుసా..
గుజరాత్‌లోని వడోదరలో లీటర్ పెట్రోల్ రూపాయికే లభిస్తుంది. టీం రివల్యూషన్ అనే సంస్థ 1 రూపాయికే 1 లీటర్ పెట్రోల్ పంపిణీ చేస్తోంది. వాస్తవానికి పెరుగుతున్న ధరను, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ ఈ సంస్థ ఈ ప్రత్యేక మార్గం ద్వారా నిరసన తెలుపుతుంది. దీని కింద 1 రూపాయికే 1 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇస్తున్నారు. పెట్రోల్ ఇవ్వడానికి ఉన్న ఏకైక షరతు ‘వందే మాతరమ్ ‘ లేదంటే ‘భారత్ మాతా కి జై’. టీం రివల్యూషన్ అనే ఈ సంస్థ 300 లీటర్ల పెట్రోల్ పంపిణీ చేయాలని నిర్ణయించింది.
సోమవారం ఉదయం 11 గంటల నుంచి ఈ పెట్రోల్, డీజిల్‌ను లీటరుకు రూ.1 చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సంస్థ అధిపతి స్వెజల్ వ్యాస్ రాజకీయ పార్టీల కార్మికులకు, సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ప్రజలకు మోదీ ప్రభుత్వం ఉపశమనం ఇవ్వబోతోందని టీం రివల్యూషన్ అనే సంస్థ చెబుతోంది. త్వరలో పెట్రోల్, డీజిల్ రేటును తగ్గించడానికి ప్రభుత్వం తన పన్నును తగ్గిస్తుందని తెలిపారు.