కుక్కల దాడులు తరచూ మనం వింటూనే ఉంటాం. ఐతే ఎవరైనా దాన్ని బెదిరిస్తేనో..కర్ర చూపిస్తేనో అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కానీ పంజాబ్ జలంధర్‌లో దారుణం జరిగింది. బెదిరించడం కాదు..కర్రలతో చితకబాదినా కదల్లేదు. ఓ బాలుడి పిక్కను పట్టుకున్న శునకం స్థానికులు ఎంత కొట్టినా వదిలిపెట్టలేదు.
15 ఏళ్ల లక్ష్ ఉప్పల్ అనే బాలుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా..పిట్‌బుల్ జాతికి చెందిన ఓ కుక్క తన ప్రతాపం చూపించింది. ఒక్కసారిగా అతనిపై దాడి చేసి అతని కాలిని పట్టేసుకుంది. బాలుడు బాధతో అరుపులు వేయడంతో కుక్కను చుట్టుముట్టిన స్థానికులు కర్రలతో చితకబాదారు. అయినా ఏ మాత్రం బెదరని ఆ శునకం..బాలుడి కాలిని మాత్రం వదిలిపెట్టలేదు. చివరికి 15 నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుక్క దాడిలో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
“कमजोर दिल वाले यह वीडियो न देखे”
पंजाब: ट्यूशन से लौट रहे बच्चे पर पिटबुल का हमला, लोग डंडे-पत्थरों से पीटते रहे, लेकिन कुत्ते ने बच्चे को नहीं छोड़ा, बच्चा गंभीर रूप से हुआ जख्मी, ये वीडियो जालंधर के माई हीरा गेट के पास पड़ते पुरिया मोहल्ला की बताई जा रही है। pic.twitter.com/ZaZrPcr3wF
— आदित्य तिवारी ( Aditya Tiwari ) (@adityatiwaree) January 28, 2020