Cyclone Tauktae live tracking: తీర ప్రాంతాలను ముంచేస్తున్న ‘తౌక్టే’.. ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన IMD

|

May 17, 2021 | 12:16 PM

Cyclone Tauktae: దేశ పశ్చిమ తీరాన్ని ‘తౌక్టే’ ముంచేస్తోంది. వేగంగా వస్తున్న సుడిలో చిక్కుకొంది. కేరళ, కర్ణాటక, గోవా తీర ప్రాంతాలను తుడిచిపెట్టేస్తోంది.‘తౌక్టే’ తుపాను ఆదివారం మరింతగా బలపడింది. ‘అతి తీవ్ర తుపాను’గా మారి

Cyclone Tauktae live tracking: తీర ప్రాంతాలను ముంచేస్తున్న ‘తౌక్టే’.. ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన IMD
Follow us on

దేశ పశ్చిమ తీరాన్ని ‘తౌక్టే’ ముంచేస్తోంది. వేగంగా వస్తున్న సుడిలో చిక్కుకొంది. కేరళ, కర్ణాటక, గోవా తీర ప్రాంతాలను తుడిచిపెట్టేస్తోంది.‘తౌక్టే’ తుపాను ఆదివారం మరింతగా బలపడింది. ‘అతి తీవ్ర తుపాను’గా మారి గుజరాత్‌ తీరంవైపు దూసుకుపోతోందని IMD ప్రకటించింది. ఇది ఉత్తర, వాయవ్య దిశగా పయనించి సోమవారం సాయంత్రానికి గుజరాత్‌ తీరాన్ని తాకనుందని తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున పోరుబందర్‌- మహువాల మధ్య తీరాన్ని దాటవచ్చని పేర్కొంది. ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయానికి తుపాను గంటకు 11 కి.మీ. వేగంతో ముందుకు కదులుతోంది.

అమ్రేలి, గిర్ సోమనాథ్, డియు, భావ్‌నగర్, భరూచ్, ఆనంద్ మరియు అహ్మదాబాద్‌కు దక్షిణ భాగాలపై 2-3 మీ., మరియు సూరత్, నవసరి మరియు వల్సాద్, మరియు 1-2 మీ. మిగిలిన తీర జిల్లాల్లో .5-1 మీ. ల్యాండ్ ఫాల్ సమయంలో తుఫాను కారణంగా తీరం వెంబడి ఉన్న ఈ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు చాలా వరకు మునిగిపోయే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తౌక్టే దెబ్బకు కర్ణాటకలో నలుగురు, గోవాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కేరళను భారీ వానలు ముంచెత్తాయి. తుపాను పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్షించారు. తగిన ముందస్తు సహాయ చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో గుజరాత్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన దీవ్‌, దమణ్‌లలో ‘ఎల్లో అలర్ట్‌’ ప్రకటించింది. మంగళవారం నాటికి గాలుల వేగం గంటకు 150-160 కి.మీ.కు పెరుగుతుందని హెచ్చరించింది. గాలి దుమారం వేగం గంటకు 175 కి.మీ.గా ఉంటుందని తుపాను హెచ్చరికల విభాగం తెలిపింది.

ఇప్పటికే  మహారాష్ట్ర తీరంలో గాలి వేగంగా వీస్తోంది.. గంటకు 65-75 కి.మీ… దుమారం వేగం గంటకు 85 కి.మీ. ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముంబై సముద్ర తీర ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  అయితే ముంబై మీదుగా గుజరాత్‌వైపు పయనిస్తుందని వివరించారు.

ఇవి కూడా చదవండి:  Viral Video: చేప మేడలో మెరిసిన వెడ్డింగ్ రింగ్ మ్యాట‌ర్ ఏంటంటే… ( వీడియో )

Viral Video: పసిబిడ్డను ఆడించిన గొరిల్లా…!! నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో…

Kedarnath: తెరచుకుంటున్న కేదార్‌నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ.. ఆన్‌లైన్‌ దర్శనాలు మాత్రమే!