Tamil Nadu Elections: తమిళనాడు రాజకీయాలను పరిశీలించినట్లయితే.. దాదాపు అక్కడి నాయకులు తమకు విశ్వాసపాత్రులైన వారికే అధిక ప్రధాన్యత ఇస్తారు. ఈ విషయంలో దివంగత నాయకురాలు జయలలిత, నెచ్చెలి శశికళ పేరును ప్రధానంగా చెప్పాలి. ఎందుకుంటే.. జయలలిత మృతి తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తమిళనాట తన ప్రాబల్యం కాపాడుకోవడానికి శశికళ.. తన విశ్వాసపాత్రుడైన పళనిస్వామిని తమిళనాడు ముఖ్యమంత్రిగా నియమించారు. కానీ పరిస్థితి అడ్డం తిరిగి ఆమె ప్రాబల్యానికి పెద్ద గండి పడింది. ఆ సంగతి అలా ఉంటే.. శశికళ మాత్రం తనను నమ్మిన వారికి ఏదో విధంగా సాయం చేస్తారనే ప్రచారం ఉంది. తాజాగా తమిళనాట వినిపిస్తున్న ఓ వార్త ఇందుకు ప్రధాన నిదర్శనంగా చెప్పుకొవచ్చు.
ఇక వివరాల్లోకెళితే.. ఫిబ్రవరి 7వ తేదీన శశికళ బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చిన విషయం తెలిసిందే. శశికళ కారు తమిళనాడులోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడి పోలీసులు ఆమె కారును అడ్డుకున్నారు. కారణం.. అన్నాడీఎంకే పార్టీ జెండాను శశికళ తన కారుకు పెట్టుకోవడమే. శశికళను పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో పార్టీ జెండా ఉపయోగించడానికి వీల్లేదంటూ ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల ప్రకారం.. జెండాను తొలగించాలని లేదంటే వేరే కారులో వెళ్లాలంటూ పోలీసులు తెలిపారు. అయితే, శశికళ కాన్వాయ్ వెంట వచ్చిన అన్నాడీఎంకే నేత దక్షిణామూర్తి.. పోలీసులకు షాక్ ఇచ్చారు.
శశికళ కారుకు అన్నాడీఎంకే పతాకం పెట్టడం తప్పయితే.. అన్నాడీఎంకేలో వున్న తన కారుపై ఆ పార్టీ పతాకం పెట్టడంలో తప్పులేదంటూ శశికళను తన వాహనంలో చెన్నైకి తీసుకెళ్లారు. దక్షిణా మూర్తి శశికళ పరువు కాపాడారంటూ అప్పట్లో పెద్ద టాక్ నడిచింది. కాగా, నాటి సాయాన్ని దృష్టిలో పెట్టుకున్న శశికళ.. తాజాగా దక్షిణామూర్తికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అమ్మా మక్కల్ మున్నెట్ర కళగం(ఏఎంఎంకే) తరఫున మాధవరం నియోజవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్ కేటాయించారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు దక్షిణామూర్తికి తెలుపడంతో అతను శశికళకు ధన్యవాదాలు తెలిపాడు.
తమిళనాడులో ఎన్నికలు మార్చి 12వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు ఒకే విడతలో పోలింగ్ జరనునుంది. ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 12న విడుదల చేయనుండగా, నామినేషన్లకు చివరి తేది మార్చి 19గా నిర్ణయించారు. ఇక నామినేషన్ల పరిశీలనకు మార్చి 20వ తేదీ గడువుగా పెట్టారు. మార్చి 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించి.. మే 2న ఫలితాలు ప్రకటించనున్నారు.
Also read: Goolgle Maps: గూగుల్ మ్యాప్స్‌లో మరో కొత్త ఫీచర్… ఇకపై మీరూ మ్యాప్స్‌ను ఎడిట్ చేయొచ్చు..
Covid-19 Effect: విమానాశ్రయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా..? అయితే నో ఎంట్రీ.. డీజీసీఏ కొత్త రూల్స్